PSLV-C53 Mission: ISRO Sends Three
Satellites from Singapore to Space
పీఎస్ఎల్వీ
సీ53 మిషన్ ప్రయోగం విజయవంతం
పీఎస్ఎల్వీ
సీ53 మిషన్ ప్రయోగం విజయవంతమైంది. తిరుపతి జిల్లాలోని భారత
అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) రెండో ప్రయోగ వేదిక
నుంచి గురువారం సాయంత్రం 6.02 గంటలకు
పీఎస్ఎల్వీ-సి58 నింగిలోకి దూసుకెళ్లింది.
రాకెట్
సన్నద్ధత,
లాంచ్ ఆథరైజేషన్ సమావేశాల అనంతరం ప్రయోగానికి పచ్చజెండా
ఊపారు. కౌంట్ డౌన్ నిరంతరాయంగా 26 గంటల పాటు కొనసాగిన
పిదప వాహకనౌక నింగిలోకి పయనించింది. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్)
వాణిజ్య పరమైన రెండో మిషన్ ఇది. సింగపూర్, కొరియాకు
చెందిన మూడు ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టనుంది.
డీఎస్-ఈవో ఉపగ్రహం బరువు 365 కిలోలు. ఇది 0.5 మీటర్ల రిజల్యూషన్ ఇమేజింగ్ సామర్థ్యంతో ఎలక్ట్రో ఆప్టిక్, మల్టీ-స్పెక్టల్ పేలోడ్ ను కలిగి ఉంది. ఎ యూఎస్ఎఆర్ అనేది ఎస్ఎఆర్ పేలోడ్ ను మోసుకెళ్లే సింగపూర్ కు చెందిన మొట్టమొదటి బుల్లి వాణిజ్య ఉపగ్రహం. పీఎస్ఎల్వీ సీ39 ప్రయోగం విజయవంతం కావడం పట్ల శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. పీఎస్ఎల్వీ సిరీస్ లో ఇది 55వ ప్రయోగం.
PSLV-C53/DS-EO Mission is successfully accomplished.
— ISRO (@isro) June 30, 2022
PSLV-C53/DS-EO Mission: Countdown is ON. Watch the launch LIVE on the ISRO website https://t.co/5wOj8azXcf or the ISRO Official Youtube channel (https://t.co/5htvDtWK80) from 17:32 hours IST.
— ISRO (@isro) June 30, 2022
Watch from 33.33 sec in the below Video 👇
0 Komentar