Public Provident Fund: How to get Rs 1
crore with PPF
పబ్లిక్
ప్రావిడెంట్ ఫండ్: PPFతో రూ. 1 కోటిని పొందాలంటే,
నెలకు ఎంత మదుపు చేయాలి?
Public Provident Fund - ప్రజా భవిష్య నిధి (PPF).. 100 శాతం నష్టభయం లేని పథకం. దీర్ఘకాల లక్ష్యాల కోసం మదుపు చేసే వారికి సరిగ్గా
సరిపోతుంది. పెట్టుబడులకు ప్రభుత్వ హామీతో పాటు మంచి రాబడి ఉంటుంది. అంతేకాకుండా
ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సి ప్రకారం ఒక
ఆర్థిక సంవత్సరంలో రూ.1.50 లక్షల వరకు పన్ను
మినహాయింపు ప్రయోజనాలను పొందొచ్చు. ప్రస్తుతం వార్షికంగా 1.10 శాతం వడ్డీ అందిస్తోంది.
పీపీఎఫ్
ఖాతాకు 15 సంవత్సరాల మెచ్యూరిటీ పిరియడ్ ఉంటుంది. అయితే, 15 సంవత్సరాల తర్వాత కూడా ఐదేళ్ల చొప్పున ఎన్నిసార్లైనా
ఖాతాను పొడిగించుకోవచ్చు. మదుపర్లు తెలివిగా ఒక ప్రణాళిక ప్రకారం పీపీఎఫ్ లో మదుపు
చేస్తే.. కాలపరిమితి పొడిగింపు ప్రయోజనాన్ని ఉపయోగించుకుని విత్ డ్రా చేసుకునే
సమయానికి రూ. కోటి సమకూర్చుకోవచ్చు. దీనికి క్రమశిక్షణతో పెట్టుబడులు చేయడం అవసరం.
సాధారణంగా
పీపీఎఫ్ లో నెల నెలా.. 3 నెలలు, 6 నెలలు, ఏడాదికోసారి
డిపాజిట్ చేయవచ్చు. లేదా ఏడాదికి కనీసం మొత్తం రూ. 500 డిపాజిట్ చేసి ఖాతాను నిర్వహించవచ్చు. అయితే, కోటి రూపాయల పెద్ద మొత్తం కావాలంటే పెట్టుబడులు చేసే పీపీఎఫ్ ఖాతాదారులు తాము
ఎంచుకున్న ప్రకారం సమయానుసారం మదుపు చేయాల్సి ఉంటుంది. పాక్షిక విత్ డ్రాలు, రుణాల జోలికి పోకూడదు.
పీపీఎఫ్
ఖాతాలో మదుపర్లు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఈ నియమాన్ని అనుసరించి రూ.1 కోటి సమకూర్చుకునేందుకు ఎన్ని సంవత్సరాలు పీపీఎఫ్ ఖాతాను
కొనసాగించాలో ఇప్పుడు చూద్దాం. వార్షికంగా పీపీఎఫ్ లో అనుమతించిన గరిష్ఠ పరిమితి
మేరకు,
అంటే ఏడాదికి రూ.1.50 లక్షలు పెట్టుబడి పెట్టేవారు రూ.1 కోటి కోసం 25 సంవత్సరాలు పెట్టుబడులను కొనసాగించాల్సి ఉంటుంది.
గమనిక: పై
పట్టికలో కోటి రూపాయిలు సమకూర్చుకోవడానికి ఎంత కాలం పడుతుందో పాఠకుల అవగాహన కోసం
ఇవ్వడం జరిగింది.
15 సంవత్సరాల
మెచ్యూరిటీ పిరియడ్ తర్వాత 20, 25, 30, 35.. ఇలా 5 సంవత్సరాల చొప్పున పెట్టుబడులను కొనసాగించాలి. నెలకు రూ. 12,500 పెట్టుబడి పెట్టేవారు 25 సంవత్సరాల
వరకు;
నెలకు రూ. 12,000 నుంచి రూ. 8,500 వరకు పెట్టుబడి
పెట్టేవారు 30 సంవత్సరాల వరకు; రూ. 8000 నుంచి రూ. 6000 పెట్టుబడి పెట్టేవారు 35 ఏళ్ల పాటు
(మధ్యలోనే రూ.1 కోటి సమకూరినప్పటికీ) పెట్టుబడులను
కొనసాగించాలి.
15 సంవత్సరాల మెచ్యూరిటీ పిరియడ్ తర్వాత పీపీఎఫ్ ఖాతాను కొనసాగించాలనుకునే వారు
పీపీఎఫ్ ఖాతా తెరిచిన తర్వాత 15వ సంవత్సరం ఐదేళ్ల
కొనసాగింపు కోసం కావాల్సిన ఫారంను సమర్పించాల్సి ఉంటుంది. తర్వాత నుంచి ప్రతి 5వ సంవత్సరం కొనసాగింపు కోసం ఫారం సమర్పించవచ్చు.
0 Komentar