Ranji Trophy 2022: Madhya Pradesh beat
Mumbai to win maiden title
రంజీ ట్రోఫీ 2022: ముంబైని ఓడించి తొలి టైటిల్
గెలుచుకున్న మధ్యప్రదేశ్
దేశవాళీ క్రికెట్ లో మధ్యప్రదేశ్ సత్తా
చాటింది. ఈ ఏడాది రంజీ ట్రోఫీని ఆ రాష్ట్ర క్రికెట్ జట్టు సొంతం చేసుకుంది.
క్రికెట్ కు పవర్ హౌస్ లాంటి ముంబయి జట్టును ఆరు వికెట్ల తేడాతో ఓడించి రంజీ
చరిత్రలో తొలిసారి ట్రోఫీని దక్కించుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో
ముంబయిను 269 పరుగులకు కట్టడి చేసి, 108 పరుగుల
లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. కోచ్ చంద్రకాంత్ పండిట్ కు ఇది ఆరో నేషనల్
టైటిల్.
ఈ ఏడాది రంజీ సెమీ ఫైనల్ లో బెంగాల్ ను ఓడించి మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ ను కట్టడి చేసి ముంబయి జట్టు ఫైనల్‌కు చేరాయి. జూన్ 22న మొదలైన ఫైనల్ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన ముంబయి బ్యాటింగ్ ఎంచుకుంది.
తొలి ఇన్నింగ్స్ లో 374 పరుగులకు ఆలౌట్ అయింది. సర్పరాజ్ ఖాన్ 134 (234 బంతుల్లో 18x4; 2x6) సెంచరీతో రాణించాడు. తొలి ఇన్నింగ్స్ లో భాగంగా
బ్యాటింగ్ కు దిగిన మధ్యప్రదేశ్ బ్యాట్స్ మెన్స్ తమదైన శైలిలో విరుచుకుపడ్డారు.
ఓపెనర్ యశ్ దూబే 133 (336 బంతుల్లో 14x4) సహా శుభమ్
శర్మ 116 (215 బంతుల్లో 15x4,
1x6) రజిత్ పాటిదార్ 122 (219 బంతుల్లో 20x4) సెంచరీలతో అదరగొట్టగా, చివర్లో
శరస్ట్ జైన్ (57) అర్ధశతకంతో రాణించడంతో మధ్యప్రదేశ్ 536 పరుగుల భారీ స్కోరు చేసింది. సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా బ్యాటింగ్ కు దిగిన
ముంబయి మరోసారి పేలవ ప్రదర్శనతో 269 పరుగులకు ఆలౌట్ అయింది. 108 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ కేవలం నాలుగు వికెట్లు
కోల్పోయి మ్యాచ్ గెలవడమే కాకుండా తొలిసారి రంజీ ట్రోఫీని ముద్దాడింది. ప్లేయర్ ఆఫ్
ది మ్యాచ్ గా శుభమ్ శర్మ ఎంపికగా, ఈ సీజన్ లో 1000 పరుగులకు పైగా చేసిన సర్ఫరాజ్ ఖాన్ (ముంబయి) ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా
ఎంపికయ్యాడు.
కోచ్ రవిచంద్రకాంత్ పండిత్ ఉద్వేగం:
మధ్యప్రదేశ్ జట్టు రంజీ ట్రోఫీని కైవసం చేసుకోవడంతో కోచ్
రవి చంద్రకాంత్ పండిత్ భావోద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారు. 1999లో ఆయన మధ్యప్రదేశ్ రంజీ జట్టు కెప్టెన్ గా ఉన్న సమయంలో ఇదే చిన్నస్వామి
స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయారు. దాదాపు 23 ఏళ్ల తర్వాత
చంద్రకాంత్ కోచ్ గా వ్యవహరించిన మధ్యప్రదేశ్ జట్టు ట్రోఫీని కైవసం చేసుకోవడంతో
స్టేడియంలోనే భావోద్వేగానికి గురయ్యారు. మధ్యప్రదేశ్ జట్టు రంజీ ట్రోఫీని కైవసం
చేసుకోవడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు.
జట్టు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
We are the champions!! #RanjiTrophy2022 https://t.co/XLdLOiQojS pic.twitter.com/9f19MycImR
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) June 26, 2022
𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗪𝗜𝗡! 👏 👏
— BCCI Domestic (@BCCIdomestic) June 26, 2022
Madhya Pradesh beat Mumbai by 6 wickets & clinch their maiden #RanjiTrophy title👍 👍 @Paytm | #Final | #MPvMUM
Scorecard ▶️ https://t.co/xwAZ13D0nP pic.twitter.com/XrSp2YzwSu
0 Komentar