RBI Gave Clarity on
replacing Gandhi's face with Tagore, Kalam in Bank Notes
ఆర్‌బీఐ: కరెన్సీ నోట్ల పై మహాత్మా గాంధీ ఫోటోను మార్చి కొత్త నోట్లను
ముద్రించనున్నారంటూ వస్తోన్న వార్తల పై స్పష్టత ఇచ్చిన ఆర్‌బీఐ
కరెన్సీ
నోట్ల పై మహాత్మా గాంధీ ఫోటోను మార్చి కొత్త నోట్లను ముద్రించనున్నారంటూ వస్తోన్న
వార్తలను భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ఖండించింది. అలాంటి ప్రతిపాదనేదీ లేదని
తేల్చి చెప్పింది. కరెన్సీ నోట్ల పై మహాత్మా గాంధీ చిత్రానికి బదులుగా రబీంద్రనాథ్
ఠాగూర్,
అబ్దుల్ కలాం వంటి ప్రముఖుల ఫొటోలతో కొత్త బ్యాంకు నోట్లను
తీసుకొచ్చేందుకు ఆర్ బీఐ, ఆర్ధిక శాఖ
సన్నాహాలు చేస్తున్నట్లు కొన్ని మీడియాల్లో వార్తలు వచ్చాయి. ఇందుకు సంబంధించి
ప్రణాళికలు, డిజైన్లు కూడా పూర్తయినట్లు సదరు
కథనాలు పేర్కొన్నాయి.
దీంతో ఈ
వార్తలపై స్పందించిన కేంద్ర బ్యాంకు వదంతులను కొట్టిపారేసింది. ఈ మేరకు నేడు ఓ
ప్రకటన విడుదల చేసింది. "ప్రస్తుతమున్న కరెన్సీ నోట్లకు మార్పులు
చేస్తున్నామని, గాంధీ ఫొటోకు బదులుగా ఇతరుల చిత్రాలతో
నోట్లను ముద్రించనున్నామని కొన్ని మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. కానీ, అలాంటి ప్రతిపాదనేదీ లేదు" అని ఆర్ బీఐ స్పష్టం
చేసింది.
RBI
PRESS NOTE ON CURRENCY NOTES
RBI clarifies: No change in existing Currency and Banknoteshttps://t.co/OmjaKDEuat
— ReserveBankOfIndia (@RBI) June 6, 2022
0 Komentar