SBI New Toll Free Number
- Details Here
ఎస్బిఐ కొత్త
టోల్ ఫ్రీ నంబరు – ఒక్క కాల్ తో వివిధ రకాల బ్యాంకింగ్ సేవలు
స్టేట్
బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఖాతాదారులకు
కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం ఓ కొత్త టోల్ ఫ్రీ నంబరును (SBI Toll free) ప్రారంభించింది. ఈ నంబరుకు కాల్ చేయడం ద్వారా బ్యాంకు
ఖాతాదారులు వివిధ రకాల ఆర్థిక సేవలు ఇంటి వద్ద నుంచే సులభంగా పొందొచ్చు. దీంతో
ప్రాథమిక బ్యాంకింగ్ కార్యకలాపాల కోసం బ్యాంకు శాఖకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.
కాబట్టి సమయం ఆదా అవుతుంది.
ఎస్ బీఐ
కొత్త టోల్ ఫ్రీ నంబరు 1800 1234. ప్రయాణ సమయంలో
బ్యాంకింగ్ సాయం కోసం ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గుర్తుంచుకోవడం కూడా చాలా
సులభం. ఈ కొత్త టోల్ ఫ్రీ నంబరు ఉపయోగించి ఎస్ బీఐ ఖాతాదారులు.. ఖాతా బ్యాలెన్స్, చివరి 5 లావాదేవీల వివరాలు, ఏటీఎం కార్డ్ బ్లాకింగ్, డిస్పాచ్
స్టేటస్,
చెబుక్ డిస్పాచ్ స్టేటస్, టీడీఎస్ వివరాలు, డిపాజిట్ వడ్డీ
సర్టిఫికెట్ (ఈ-మెయిల్ ద్వారా పంపుతారు), పాత ఏటీఎం
కార్డు బ్లాక్ చేయడం, పాత కార్డు బ్లాక్
చేసిన తర్వాత కొత్త ఏటీఎం కార్డుకి అభ్యర్థించడం వంటి సేవలను పొందొచ్చు.
ఈ సేవలు 24X7 అందుబాటులో ఉంటాయి. 1800 1234తో పాటు 1800 11 2211, 1800 425 3800, 1800 2100, లేదా 080 - 26599990 నంబర్లకు కూడా కాల్
చేయవచ్చు. ఇవన్నీ టోల్ ఫ్రీ నంబర్లే. ఎసీబీఐ కస్టమర్లు బ్యాంకింగ్ సేవలు, సందేహాల నివృత్తి కోసం దేశీయంగా ఉన్న అన్ని మొబైల్, ల్యాండ్ లైన్ నంబర్ల నుంచి ఈ టోల్ ఫ్రీ నంబర్లకు కాల్
చేయవచ్చు.
Dial our new easy to remember number for banking assistance on the go! Call SBI Contact Centre toll free at 1800 1234.#SBI #SBIContactCentre #TollFree #PhoneBanking #AmritMahotsav #AzadiKaAmritMahotsavWithSBI pic.twitter.com/lHWjYOQ8dz
— State Bank of India (@TheOfficialSBI) June 23, 2022
0 Komentar