SBI Services Down from Afternoon Across India
స్తంభించిన ఎస్బిఐ
సేవలు - మధ్యాహ్నం నుంచి సమస్యలతో ఫిర్యాదులు
దేశవ్యాప్తంగా
ఎస్బీఐ సేవలకు (SBI down) అంతరాయం ఏర్పడింది.
మధ్యాహ్నం నుంచి ఎస్బీఐ సేవలు పూర్తిగా స్తంభించాయి. దీంతో యూజర్లు సామాజిక
మాధ్యమాల్లో ఫిర్యాదు చేస్తున్నారు. ఆన్ లైన్ బ్యాంకింగ్, ఫండ్ ట్రాన్స్ ఫర్ విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తమ
ఫిర్యాదులో పేర్కొంటున్నారు.
యూపీఐ
విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. ఏటీఎం కేంద్రాల్లో నగదు
ఉపసంహరణలు కూడా జరగడం లేదని పేర్కొంటున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ విధంగా ఫిర్యాదులు అందుతున్నట్లు డౌన్
డిటెక్టర్ వెబ్ సైట్ పేర్కొంది. అయితే, సేవల
పునరుద్ధరణ పై ఎస్బీఐ స్పందించలేదు.
యూజర్లు యోనో
యాప్ తెరవడానికి ప్రయత్నించినప్పుడు మెయింటెన్స్ కారణంగా సేవలకు అంతరాయం
ఏర్పడుతున్నట్లు ఓ మెసేజ్ దర్శనమిస్తోంది. నెలాఖరులో జీతాలు పడే వేళ సేవల్లో
అంతరాయం తలెత్తడంపై ఖాతాదారులు పెదవి విరుస్తున్నారు.
0 Komentar