Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Singer KK Dies After Concert In Kolkata

 

Singer KK Dies After Concert In Kolkata

ప్రముఖ నేపథ్య గాయకుడు కేకే హఠాన్మరణం  - తెలుగు లో ఎన్నో సూపర్ హిట్ గీతలని ఆలపించిన కేకే

ప్రముఖ నేపథ్య గాయకుడు కేకే (కృష్ణకుమార్ కున్నత్) హఠాన్మరణం చెందారు. కేకే తన ఆఖరి ప్రోగ్రాంకు సంబంధించిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. 53 ఏళ్ల కేకే గత మూడు దశాబ్దాల్లో హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, బెంగాలీ భాషల్లో అనేక హిట్‌ గీతాలను ఆలపించారు. కేకే హఠాన్మరణం మరణం పట్ల ప్రధాని మోదీ సహా బాలీవుడ్‌ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

కేకే పేరిట ప్రసిద్ధుడైన ప్రముఖ సినీ గాయకుడు కృష్ణకుమార్ కున్నథ్ (53) మంగళవారం ఆకస్మికంగా మృతిచెందారు. దక్షిణ కోల్ కతాలోని నజరుల్ మంచా ఆడిటోరియంలో ప్రదర్శన ఇస్తూ ఉన్నపళంగా కుప్పకూలిపోయారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. రాత్రి 10.30 గంటలకు స్థానిక సీఎంఆర్‌ ఆసుపత్రికి ఆయన్ను తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధరించారు. అప్పటిదాకా తన పాటలతో అందరినీ అలరిస్తూ ఉన్నట్టుండి కిందపడటంతో దేహంపై కొద్దిపాటి గాయాలు ఉన్నాయి. 'దిల్ ఇబాదత్ గాయకుడిగా ప్రసిద్ధుడైన కేకే మృతికి కారణాలు వెంటనే తెలియరాలేదు.

తెలుగులో ఆర్య-2 చిత్రంలో 'ఉప్పెనంత ఈ ప్రేమకి.. గుప్పెడంత ఈ గుండె ఏమిటో', టక్కరి దొంగలో 'అలేబా అలేబా', ఇంద్రలో 'దాయి దాయి దామ్మా' నువ్వే నువ్వేలో 'అయామ్ వెరీ సారీ' వంటి పాటలు ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. ఎ.ఆర్. రెహమాన్ సంగీత దర్శకత్వంలో ఆయన ఎక్కువ గీతాలు ఆలపించారు.

తెలుగుతోపాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడం, బెంగాలీ, మరాఠీ, అస్సామీ, గుజరాతీ భాషల్లో సైతం పాటలు పాడి అలరించారు. దేవదాసు, హ్యాపీ న్యూ ఇయర్, బజరంగీ భాయీజాన్ వంటి సినిమాల్లో గీతాలు ఆలపించి తనదైన ముద్ర వేశారు. కేకే మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు అభిమానులు, నెటిజన్లు సామాజిక మాధ్యమాల ద్వారా సంతాపం తెలిపారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags