Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

తెలుగును సంస్కృతంలోకి అనువదించే సాఫ్ట్ వేర్ పేటెంట్ - సాఫ్ట్ వేర్ డెవలప్ చేసిన కావలికి చెందిన ప్రొఫెసర్ కామేశ్వరరావు

 

తెలుగును సంస్కృతంలోకి అనువదించే సాఫ్ట్ వేర్ పేటెంట్ - సాఫ్ట్ వేర్ డెవలప్ చేసిన కావలికి చెందిన ప్రొఫెసర్ కామేశ్వరరావు

తెలుగును సంస్కృతంలోకి అనువదించే సాఫ్ట్ వేర్ కు కేంద్ర ప్రభుత్వం పేటెంట్ ఇచ్చింది. దీన్ని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలికి చెందిన ప్రొఫెసర్ తియ్యబిండి కామేశ్వరరావు అభివృద్ధి చేశారు. ఆయన గుంటూరులోని వీవీఐటీ కంప్యూటర్ విభాగంలో పనిచేస్తున్నారు. తాను రూపొందించిన సాఫ్ట్ వేర్ పై కేంద్రానికి 2016లో దరఖాస్తు చేయగా ఇటీవల పేటెంట్ అనుమతి వచ్చింది.

ఇదే సాంకేతికతను ఆధారంగా చేసుకుని సంస్కృతాన్ని మరిన్ని భాషల్లోకి అనువదించే సాఫ్ట్ వేర్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. రెండో పరిశోధనగా సంస్కృతాన్ని ఆంగ్లంలోకి తర్జుమా చేసే సాఫ్ట్ వేర్ రూపొందిస్తున్నామని, దీని పేటెంట్ కోసం దరఖాస్తు చేస్తామని అన్నారు. కామేశ్వరరావు భార్య రాజ్యలక్ష్మి కూడా ఇదే సంస్థలో సహాయ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags