తెలంగాణలో కొత్తగా
మరో 10,105 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి – వివరాలు ఇవే
తెలంగాణలో
నిరుద్యోగులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కొత్తగా మరో
10,105 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో
గురుకులాల్లోనే 9,096 పోస్టులు ఉన్నాయి. బీసీ గురుకులాల్లో 3,870, గిరిజన గురుకులాల్లో 1,514, ఎస్సీ గురుకులాల్లో 2,267 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులన్నింటినీ గురుకుల
విద్యాలయాల నియామక బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారు.
ఎస్సీ అభివృద్ధిశాఖలో 316, మహిళా శిశుసంక్షేమశాఖలో 251, బీసీ సంక్షేమశాఖలో 157, గిరిజన సంక్షేమశాఖలో - 78, దివ్యాంగశాఖలో 71, జువైనల్ వెల్ఫేర్ లో 66 పోస్టులు సహా ఇతర 995 ఉద్యోగాలను టీఎస్ పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు.
మహిళా శిశుసంక్షేమశాఖలో జిల్లా ఎంపిక కమిటీ ద్వారా మరో 14 ఉద్యోగాలను భర్తీ
చేయనున్నారు. తాజా అనుమతితో ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 45,325 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. ఉద్యోగాల
భర్తీ అంశాన్ని ట్విటర్ ద్వారా ఆర్థికమంత్రి హరీశ్ రావు వెల్లడించారు. త్వరలోనే
మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయని తెలిపారు.
0 Komentar