TS Govt Gave Permission
to TSPSC to fill Another 1433 Posts
టీఎస్: పురపాలక, పంచాయతీరాజ్ శాఖల్లో మరో 1,433 ఉద్యోగాల నియామకానికి ప్రభుత్వం అనుమతి
పురపాలక, పంచాయతీరాజ్ శాఖల్లో మరో 1,433 ఉద్యోగాల నియామకానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ఆర్థికశాఖ
ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 657 ఏఈఈ,
113 ఏఈ, హెల్త్
అసిస్టెంట్లు, శానిటరీ ఇన్ స్పెక్టర్లు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది, అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, ఏఎజ్.. తదితర పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది.
గ్రూప్-1 పోస్టులు సహా పోలీసు, రవాణా, అటవీ, ఎక్సైజ్, వంటి వివిధ శాఖల్లో 33,787 పోస్టులకు ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్-1, పోలీసు నియామకాల దరఖాస్తుల ప్రక్రియ కూడా పూర్తైంది. తాజాగా
ఉత్తర్వులిచ్చిన 1433 ఖాళీలు కలుపుకొని..
ఇప్పటి వరకు 35,220 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతులు
జారీ చేసినట్లు అయ్యింది.
వైద్య, ఆరోగ్యశాఖలోని 12,775 ఉద్యోగాలను విడతలవారీగా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో 10,028 ఉద్యోగాలను మెడికల్ రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా భర్తీ
చేయనున్నారు. అందులో తొలి విడతగా 1,326 ఎంబీబీఎస్ అర్హత కలిగిన ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని మంత్రి హరీష్ రావు
అధికారులను ఆదేశించారు. మిగిలిన ఆయా శాఖల్లోని ఖాళీల భర్తీకి ఉత్తర్వులు జారీ
చేసేందుకు ఆర్థికశాఖ కరసత్తు చేస్తోంది.
0 Komentar