TS: జులై 6
నుంచి బహిరంగ మార్కెట్లోకి పాఠ్యపుస్తకాలు - ఈ ఏడాది నుంచి పుస్తకాల్లో ఛాప్టర్ల వారీగా క్యూఆర్ కోడ్ ప్రచురణ
ప్రచురణల సంచాలకులు శ్రీనివాసచారి వెల్లడి
తెలంగాణలో
పాఠశాల విద్యార్థులకు జులై 6 నుంచి బహిరంగ
మార్కెట్లో పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి రానున్నాయని ప్రభుత్వ పాఠ్యపుస్తకాల
ప్రచురణల సంచాలకులు శ్రీనివాసచారి తెలిపారు. ఈ ఏడాది పాఠ్యపుస్తకాల్లో ఛాప్టర్ల
వారీగా క్యూఆర్ కోడ్ ప్రచురించామని పేర్కొన్నారు. తద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్
చేసి ఆ పాఠాన్ని ఆడియో, వీడియో రూపంలో
చదివేందుకు విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు. ఒకటి నుంచి పదో తరగతి
వరకు అన్ని సబ్జెక్టుల పాఠ్య పుస్తకాలను విక్రయించేందుకు ఏర్పాట్లు చేసినట్లు
చెప్పారు.
కాగితం ధర, టెండర్లు ఖరారు చేయడంలో జాప్యం కావడంతో పాఠ్యపుస్తకాలు
అందుబాటులోకి రావడం ఆలస్యం అవుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ, విక్రయాల కాంట్రాక్టును 13 ప్రైవేటు సంస్థలకు అప్పగించినట్లు తెలిపారు.
జిల్లా
విద్యాశాఖ అధికారి నుంచి అనుమతి పొందిన విక్రయ కేంద్రాల్లో జులై 6వ తేదీ నుంచి పాఠ్యపుస్తకాల అమ్మకాలు ప్రారంభం అవుతాయని
వివరించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకన్నా ఎక్కువ ధర వసూలు చేస్తే డీఈఓలకు
ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం 1 నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల
మాధ్యమం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో... వాటికి సంబంధించిన పాఠ్యపుస్తకాల ముద్రణ
కూడా పూర్తి చేయనున్నట్లు శ్రీనివాసచారి స్పష్టం చేశారు.
0 Komentar