Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS - MDM - Instructions - 13.06.2022

 

TS - MDM - Instructions - 13.06.2022

టిఎస్: పాఠశాల విద్య - మధ్యాహ్న భోజన పథకం అమలుపై సూచనలు

ఆర్. సి. నెం.265/MDM/2021,తేదీ:13.06.2022

విషయము: పాఠశాల విద్య - మధ్యాహ్న భోజన పథకం అమలుపై సూచనలు - జారీచేయుట గూర్చి.

*****

ది.13.06.2022 నుండి పాఠశాలలు పున: (ప్రారంభమగుచున్నందున్న రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులకు మరియు మండల విద్యాశాఖాధికారులకు మధ్యాహ్న భోజన పథకం అమలుపై ఈ దిగువ తెలిపిన సూచనలు ఇవ్వనైనది.

1. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు జరిగేటట్లు తగిన చర్యలు తీసికొనవలెను.

2. ప్రతీ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం వివరాలు మరియు మెనూను పాఠశాల గోడ మీద వ్రాయించవలెను.

3. నిర్దేశించిన మెనూ ప్రకారము విద్యార్థులకు మధ్యాహ్న భోజనమును సరఫరా చేయవలెను. విద్యార్థులకు వారానికి 3 సార్లు కోడిగుడ్డును తప్పనిసరిగా ఇవ్వవలెను. ఈ విషయంలో సంబంధిత వంట ఏజెన్సీ వారి నుండి లిఖిత పూర్వకంగా ఒప్పంద పత్రంను తీసికొనవలెను.

4. ది.13.06.2022 నుండి మధ్యాహ్న భోజన పథకమునకు సంబంధించిన పూర్తి వివరాలు అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తప్పనిసరిగా SMS ద్వారా పంపుటకు తగిన చర్యలు తీసికొనవలెను.

Send daily SMS to 15544 regarding meal taken in the format

MDM <space>meal taken number

Ex: - MDM 30 (in case meal taken is 30 students)

Send enrolment of students monthly once in the format

MDM <space>M<space> enrolment of students <space>Y<space>Y Ex: - MDM M 30 YY (if enrolment is 30)

5. మధ్యాహ్న భోజన పథకం అమలులో పాఠశాల విద్యా కమిటీలను మరియు విద్యార్థుల తల్లితండ్రులను భాగస్వామ్యం చేయవలెను.

6. పాఠశాల విద్యార్థులతో మధ్యాహ్న భోజన కమిటీ ఏర్పాటు చేసి మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీకి ఇచ్చు బియ్యము మరియు ఇతర సరుకులను విద్యార్థులచే తూకం వేయించి రిజిస్టర్లో నమోదు చేయవలెను.

7. అన్ని పాఠశాలలలో మధ్యాహ్న భోజన పథకమునకు సంబంధించిన రిజిస్టర్లు అన్నింటిని పకడ్బందీగా నిర్వహించవలెను.

8. సివిల్ సప్లైస్ అధికారులు మరియు ఇతర అధికారులు తనిఖీ చేస్తున్నందున రిజిస్టరులోని బియ్యం నిల్వలకు మరియు పాఠశాలలో ఉన్న బియ్యమునకు తేడా ఉన్న యడల సంబంధిత ప్రధానోపాధ్యాయుడు భాద్యతవహించవలసి ఉంటుంది. 9. పాఠశాలలోని ప్రధానోపాధ్యాయుడు గానీ, ఉపాధ్యాయుడుగానీ రుచి చూసిన పిదపనే విద్యార్థులకు సరఫరా చేయవలెను.

10. వేడిగా ఉన్న ఆహారమును మాత్రమే మధ్యాహ్న భోజన పథకములో విద్యార్థులకు అందచేయవలెను.

11. విద్యార్థులకు అందించే ఆహారము మరియు మంచినీరు కలుషితం కాకుండా జాగ్రత్త వహించవలెను.

12. శుభ్రమైన వంట పాత్రలలోనే మధ్యాహ్న భోజనము తయారు చేయవలెను.

13. విద్యార్థులు భోజనం చేసే ప్లేట్లు పరిశుభ్రముగా ఉండునట్లు చూడవలెను.

14. పరిశుభ్రమైన ప్రదేశములోనే విద్యార్థులు మధ్యాహ్నభోజనం చేయవలెను.

15. భోజనమునకు ముందు తరువాత కూడా విద్యార్థులు చేతులను శుభ్రంగా కడుగుకొనవలెను.

16. భోజనము తయారీలో నాణ్యతగల పదార్ధములను మాత్రమే వంట ఏజెన్సీ వారు ఉపయోగించునట్లు చూడవలెను. Double Fortified Salt ఉపయోగించవలెను.

17. ప్రతినెలా 10 వ తేదీలోగా వంట ఏజెన్సీ వారికి చెల్లించవలసిన మొత్తములను చెల్లించవలెను.

18. 100 % విద్యార్థుల ఆధార్ నెంబర్లు నమోదు అగునట్లు చర్యలు తీసికొనవలెను.

19. ప్రతి పాఠశాలలో ఈ దిగువ రిజిస్టర్లు తప్పనిసరిగా నిర్వహించవలెను.

Tasting Register.

Rice Stock register and issue register.

Minutes of SMC Meeting.

Meals taken register.

20. ప్రతిరోజూ Taste Register నందు ఆ రోజు మెను (వాసి రుచి చూసిన వారి సంతకంతో నిర్వహించవలెను.

21. ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలలలో తప్పనిసరిగా Kitchen Garden ను అభివృద్ధి చేయవలెను.

22. School Management Committee సమావేశములో తప్పనిసరిగా మధ్యాహ్న భోజన పథకము అమలును సమీక్షించుట జరగవలయును.

23. పాఠశాలలో Kitchen Garden ఏర్పా టు చేసి భోజనంలో Nutritious Values పెంచుటకు కృషి చేయవలయును.

పై సూచనలన్నీ పాటించి 2022-23 విద్యా సంవత్సరములో కూడా మధ్యాహ్న భోజన పథకము అమలును విజయవంతం చేయవలసినదిగా కోరనైనది.

DOWNLOAD PROCEEDINGS

Previous
Next Post »
0 Komentar

Google Tags