WhatsApp 2GB File Sharing
Feature Rolled Out
వాట్సాప్ లో 2జీబీ సైజ్ కలిగిన ఫైల్స్ పంపే ఫీచర్ వినియోగదారులకు అందుబాటులోకి
...
వాట్సాప్ లో 2జీబీ వరకు సైజ్ కలిగిన ఫైల్స్ ను పంపుకొనే అవకాశం అందుబాటులోకి
వచ్చింది. అటు ఆండ్రాయిడ్, ఇటు ఐఓఎస్
వినియోగదారులకు కూడా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.
ఈ ఫీచర్ ను
వాట్సాప్ ఇప్పటికే రోల్ ఔట్ చేసింది. కొందరు యూజర్లకు ఈ సదుపాయం అందుబాటులోకి
రాగా.. మరికొందరికి త్వరలోనే రానుంది. ఈ వాట్సాప్ లో ప్రస్తుతం 100 ఎంబీకి మించిన ఆడియో, వీడియో
ఫైల్స్ ను పంచుకునే వీల్లేదు. దీంతో చాలా మంది ఆ ఫైల్సను పంపుకోవడానికి ఇతర మాధ్యమాల
మీద ఆధారపడుతున్నారు. దీంతో వినియోగదారుల అభ్యర్థనలను దృష్టిలో పెట్టుకుని 2జీబీ వరకు ఫైళ్లను పంచుకునే సదుపాయం తీసుకొస్తున్నట్లు
వాట్సాప్ గతంలో ప్రకటించింది.
కొద్దిరోజులుగా
ఈ సదుపాయాన్ని పరీక్షించిన వాట్సాప్.. తాజాగా యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది.
వాట్సాప్ లో ఈ సదుపాయం మీకు వచ్చిందో లేదో తెలుసుకోవాలంటే.. 100 ఎంబీకి మించి 2జీబీ లోపల
ఉన్న ఫైలను మీకు నచ్చిన వారితో పంచుకోండి.
అయితే, ఫైల్ ఏదైనా డాక్యుమెంట్ రూపంలో అటాచ్ చేయాల్సి ఉంటుంది.
ఒకవేళ 100
ఎంబీకి మించి ఫైల్ విజయవంతంగా పంపినట్లయితే మీకు ఈ సదుపాయం
అందుబాటులోకి వచ్చినట్లే. ఒకవేళ ఫెయిల్ అయితే మీరు మరికొన్ని గంటలు ఆగాల్సి
ఉంటుంది. ప్రస్తుతం మొబైళ్లలో హై రిజల్యూషన్ కలిగిన వీడియోలను, ఫొటోలను పంచుకోవడంలో యూజర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఈ
సదుపాయం ద్వారా ఎక్కువ నిడివి కలిగిన వీడియోలతో పాటు సినిమాలు కూడా నచ్చిన వారికి
పంపించుకోవచ్చు.
📝 WhatsApp beta for Android 2.22.13.6: what's new?
— WABetaInfo (@WABetaInfo) June 3, 2022
WhatsApp is finally rolling out the ability to send documents up to 2GB in size to more users today!
Note: more users on iOS may also be able to get the same feature today!https://t.co/n8onOIhvLA
0 Komentar