Women Can Now Track Their Menstrual
Cycle on WhatsApp - Details Here
మహిళల కోసం వాట్సాప్
లో కొత్త ఫీచర్ – వివరాలు ఇవే
=======================
సరికొత్త
ఫీచర్స్ ను యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తుండటంతో వాట్సాప్ - (WhatsApp) మెసేజింగ్ యాప్ ను ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది
ఉపయోగిస్తున్నారు. సమాచార మార్పిడి నుంచి ఆన్‌లైన్ పేమెంట్, షాపింగ్ వరకు ఎన్నో రకాల సేవలు వాట్సాప్ ద్వారా యూజర్లకు
అందుబాటులో ఉన్నాయి. బ్యాంకింగ్, మెడికల్ రంగాలతోపాటు
ఈ-కామర్స్ వెబ్ సైట్ సంస్థలు కూడా చాట్ బాట్ (Chatbot)ల సాయంతో వాట్సాప్ ద్వారా యూజర్లు తమ సేవలను అందిస్తున్నాయి. తాజాగా వాట్సాప్
ద్వారా మహిళ కోసం మరో చాట్ బాట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. మహిళలు తమ నెలసరిని
సులువుగా ట్రాక్ చేసేందుకు వీలుగా సిరోనా హైజెనీ ప్రైవేట్ లిమిటెడ్ (Sirona Hygiene
Pvt. Ltd) అనే సంస్థతో కలిసి వాట్సా ప్ ఈ సేవలను
ప్రారంభించింది. భారత దేశంలో తొలిసారిగా వాట్సాప్ ద్వారా ఈ సేవలు అందుబాటులోకి
తీసుకొచ్చినట్లు సంస్థ తెలిపింది.
CLICK
HERE TO JOIN WHATSAPP SUPPORT
వాట్సాప్
ద్వారా ఈ చాట్‌బాట్ నెలసరి ట్రాకింగ్, గర్భదారణ, గర్భదారణ నివారణ వంటి మూడు రకాల సేవలను మహిళలకు
అందిస్తోంది. ఈ సేవలను ఉపయోగించుకునేందుకు మహిళలు ముందుగా నెలసరికి సంబంధించిన
కొంత ప్రాథమిక సమాచారం నమోదు చేయాల్సి ఉంటుంది. అలా నమోదు చేసిన సమాచారాన్ని చాట్
బోట్ రికార్డు చేసి కచ్చితమైన నెలసరి తేదీని యూజర్‌కు తెలియజేస్తుంది. అంతేకాకుండా
యూజర్‌కు ముందుగానే నెలసరి తేదీకి సంబంధించి రిమైండర్ ను పంపుతుంది. ఈ సేవల కోసం
యూజర్లు +919718866644 అనే నంబర్‌కు హాయ్ (Hi) అని మెసేజ్ చేయాలి. తర్వాత చాట్ బోట్ చూపించే మూడు
ఆప్షన్లలో ఒకదాన్ని ఎంచుకుని, ప్రాథమిక వివరాలు
నమోదు చేసి సేవలను పొందవచ్చు. రోజువారీ జీవితంలో అంతర్భాగమైన వాట్సాప్ ద్వారా మహిళ
జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఏఐ ఆధారిత సేవలను అందుబాటులోకి
తీసుకొస్తున్నామని సిరోనా హైజెనీ సంస్థ వెల్లడించింది. దీని ద్వారా మహిళలు మరింత
సులువుగా తమ నెలసరికి సంబంధించిన సమాచారాన్ని పొందగలరని సంస్థ తెలిపింది.
=======================
0 Komentar