68th National Film Awards for The Year
2020 – Check the Full List Here
68వ జాతీయ
చలనచిత్ర అవార్డులు -2020 – అవార్డు గ్రహీతల పూర్తి జాబితా ఇదే
జాతీయ సినిమా
అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. ఉత్తమ తెలుగు చిత్రంగా 'కలర్ ఫోటో' ఎంపికైంది. అలాగే
ఉత్తమ కొరియోగ్రఫీ, మేకప్ విభాగాల్లో 'నాట్యం', ఉత్తమ సంగీత
చిత్రం(పాటలు)గా 'అల వైకుంఠపురములో' చిత్రాలు అవార్డులు దక్కించుకున్నాయి. శుక్రవారం 68వ జాతీయ చలన చిత్ర అవార్డుల (National Film
Awards) ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఉత్తమ
నటుడిగా అవార్డును ఇద్దరు పంచుకోనున్నారు. సూరారైపోట్రు (తెలుగులో ఆకాశం నీ
హద్దురా)లో నటనకు గానూ సూర్య, తానాజీలో నటనకు అజయ్
దేవగన్ లు ఉత్తమ నటులుగా ఎంపికయ్యారు.
అలాగే ఉత్తమ నటిగా అపర్ణా బాలమురళి (సూరారైపోట్రు)ని అవార్డు వరించింది. మొత్తం
ఐదు కేటగిరీల్లో 'సూరారైపోట్రు' అవార్డులు సొంతం చేసుకుంది.
ఇక మొత్తం 30 భాషల్లో 305 ఫీచర్ ఫిల్మ్
ఎంట్రీకి వచ్చాయి. అలాగే నాన్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో 148 చిత్రాలు (20 భాషల్లో) స్క్రీనింగ్ వచ్చినట్లు జ్యూరీ మెంబర్స్ తెలిపారు ఈ ఏడాది అవార్డులను
ఐదు కేటగిరీలుగా విభజించారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, ఫీచర్ ఫిల్మ్ (28 కేటగిరీలు), నాన్ ఫీచర్ ఫిల్మ్స్ (22 కేటగిరీలు), బెస్ట్
రైటింగ్ సెక్షన్, మోస్ట్ ఫిల్మ్
ఫ్రెండ్లీ స్టేట్ కేటగిరీల్లో అవార్డులు ప్రకటించారు. మోస్ట్ ఫ్రెండ్లీ ఫిల్మ్
స్టేట్ అవార్డును ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ లు సొంత చేసుకున్నాయి. బెస్ట్ బుక్ ఆన్ సినిమా
అవార్డును 'ద లాంగెస్ట్ కిస్' (కిష్వర్ దేశాయ్) దక్కించుకుంది. దాదా సాహెబ్ ఫాల్కే
అవార్డును మరోసారి ప్రకటించనున్నట్లు జ్యూరీ మెంబర్స్ తెలిపారు.
జాతీయ
అవార్డుల విజేతలు వీరే
ఉత్తమ నటుడు:
సూర్య (సూరారై పోట్రు), అజయ్ దేవ్ గణ్
(తానాజీ)
ఉత్తమ నటి:
అపర్ణ బాలమురళి (సూరారై పోట్లు)
ఉత్తమ
చిత్రం: సూరారై పోట్రు (సుధాకొంగర)
ఉత్తమ
దర్శకుడు: దివంగత సచ్చిదానందన్ (అయ్యప్పనుమ్ కోషియుం)
ఉత్తమ సహాయ
నటి: లక్ష్మీ ప్రియ చంద్రమౌళి (శివ రంజనీయం ఇన్నుమ్ సిలా పెంగళం)
ఉత్తమ సహాయ
నటుడు: బిజూ మేనన్ (అయ్యప్పనుమ్ కోషియుం )
ఉత్తమ
యాక్షన్ డైరక్షన్: అయ్యప్పనుమ్ కోషియుమ్ (మలయాళం) రాజశేఖర్, మాఫియా శశి, సుప్రీం
సుందర్
ఉత్తమ
కొరియోగ్రఫీ: నాట్యం (తెలుగు) సంధ్యారాజు
ఉత్తమ గీత
రచన: సైనా (హిందీ) మనోజ్ ముంతిషిర్
ఉత్తమ
సంగీతం (పాటలు): అల వైకుంఠపురములో (తెలుగు) తమన్
ఉత్తమ సంగీతం
(నేపథ్య): సూరారై పోట్రు (తమిళం) జీవీ ప్రకాశ్ కుమార్
ఉత్తమ మేకప్:
నాట్యం (తెలుగు) టి.వి. రాంబాబు
ఉత్తమ
కాస్ట్యూమ్స్: తానాజీ (హిందీ) నచికేత్ బార్వే, మహేశ్ శర్గా
ఉత్తమ
ప్రొడక్షన్ డిజైన్: కప్పెలా (మలయాళం) అనీష్ నదోడి
ఉత్తమ ఎడిటింగ్: శివరంజనీయం ఇన్నుమ్ సిలా పెంగళం (తమిళం) శ్రీకర్ ప్రసాద్
ఉత్తమ
ఆడియోగ్రఫీ (లొకేషన్ సౌండ్): డోలు(కన్నడ) జాబిన్ జయాన్
ఉత్తమ సౌండ్
డిజైనర్: మి వసంతరావు(మరాఠీ) అనుమోల్ భవే
ఉత్తమ సౌండ్ డిజైన్ (ఫైనల్ మిక్స్): మాలిక్ (మలయాళం) విష్ణు గోవింద్, శ్రీ శంకర్
ఉత్తమ స్క్రీన్ ప్లే: సూరారైపోట్రు (తమిళం) షాలిని ఉషా నయ్యర్, సుధా కొంగర
ఉత్తమ
సంభాషణలు: మండేలా (తమిళం) మడోన్నే అశ్విన్
ఉత్తమ
సినిమాటోగ్రఫీ: అవిజాత్రిక్ (బెంగాలీ) సుప్రతిమ్ ఛల్
ఉత్తమ నేపథ్య గాయని: నచ్చమ్మ (మలయాళం) అయ్యప్పనుమ్ కోషియుమ్)
ఉత్తమ నేపథ్య గాయకుడు: మి వసంతరావు
(మరాఠీ) రాహుల్ దేశ్ పాండే
ఉత్తమ బాల
నటుడు: అనిశ్ మంగేశ్ గోస్వామి (టట), ఆకాంక్ష
సింగ్లే,
దివ్వేష్ తెందుల్కర్ (సుమీ) (మరాఠీ చిత్రాలు)
68th #NationalFilmAwards: (Feature Films category)
— PIB India (@PIB_India) July 22, 2022
The best Actor award is shared by two Actors @Suriya_offl for #SooraraiPottru and @ajaydevgn for Tanhaji: The Unsung Warrior pic.twitter.com/LYSZNrgYHh
0 Komentar