Agniveer and Other Govt Exams Material Available
on VI App
వొడాఫోన్
ఐడియా (VI) యాప్‌లో అగ్నివీర్
మరియు ఇతర ప్రభుత్వ పరీక్షల మెటీరియల్స్
టెలికాం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా యూజర్లను ఆకర్షించేందుకు సరికొత్త పంథాను అనుసరిస్తోంది. ఇటీవల వీఐ మొబైల్ యాప్ లో జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ పేరిట కొత్త ప్లాట్ ఫామ్ ను ప్రారంభించింది. దీనిద్వారా ఉద్యోగార్థులకు స్టడీ మెటీరియల్ ను అందించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ఎడ్ టెక్ సంస్థ 'పరీక్షతో చేతులు కలిపింది.
* కేంద్రం
ఇటీవల తీసుకొచ్చిన సైనిక నియామకాల పథకం అగ్నిపథ్ లో పోటీపడేవారికి కోసం
ప్రత్యేకంగా కోర్సు మెటీరియల్ ను అందిస్తున్నట్లు వీఐ తెలిపింది. ఇప్పటికే త్రివిధ
దళాలు అగ్నివీరుల నియామకాల కోసం నోటిఫికేషన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.
* 'పరీక్షలో పనిచేస్తున్న నిపుణులు డెహ్రాడూన్ లోని 'క్యాడెట్స్ డిఫెన్స్ అకాడమీ'తో కలిసి అగ్నివీర్ టెస్ట్ సిరీస్ ని రూపొందించింది.
* మొత్తం ఐదు
టెస్ట్ సిరీస్ లు ఉన్నట్లు వీఐ తెలిపింది. ఒక్కో సిరీస్ లో 15 టెస్ట్ లు ఉన్నట్లు వెల్లడించింది. అగ్నివీర్ ఎయిర్‌ఫోర్స్
'ఎక్స్' గ్రూప్, అగ్నివీర్ ఎయిర్‌ఫోర్స్ 'వై'
గ్రూప్, అగ్నివీర్ ఎయిర్‌ఫోర్స్
'ఎక్స్ అండ్ వై' గ్రూప్, అగ్నివీర్ నేవీ ఎంఆర్, అగ్నివీర్
నేవీ ఎస్ఎస్ఆర్ కు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు ఈ సిరీస్లను ఉపయోగించుకోవచ్చు.
ఆర్మీ విభాగానికి సన్నద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఈ నెలాఖరు వరకు మెటీరియల్ ను
అందుబాటులోకి తెస్తామని వీఐ తెలిపింది.
* రిజిస్టర్డ్
మొబైల్ నెంబరు ద్వారా వీఐ మొబైల్ యాప్ లోకి లాగిన్ అయ్యి ఈ మెటీరియల్‌ను
ఉపయోగించుకోవచ్చు.
* ఇతర ప్రభుత్వ
ఉద్యోగాలకు సంబంధించిన మెటీరియల్ కూడా అందుబాటులో ఉందని వీఐ తెలిపింది. ఒక నెల
పాటు ఈ ప్లాట్ ఫామ్ ను ఉచితంగా ఉపయోగించుకునేందుకు అవకాశం ఉంది.
* ఏడాదికి రూ. 249 చెల్లించాల్సి ఉంటుంది. 150కి పైగా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన మెటీరియల్ ను అందుబాటులో ఉంచినట్లు
వెల్లడించింది.
గవర్నమెంట్ పరీక్షల
కోర్సులను చేరుకొనే విధానం:
1. ప్లే స్టోర్ నుండి ‘VI’ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి.
2. మీ నెంబర్
(VI) నెంబర్ తోస్ లాగిన్ అవ్వాలి.
3. హోమ్ పేజీ
లో ‘Jobs & Education’ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
4. ఆ తర్వాత ‘sarkaari naukri’ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
5. అప్పుడు మీ
వివరాలు ఇవ్వాలి.
6. తర్వాత మీకు వివధ గవర్నమెంట్ ఉద్యోగాలకు నిర్వహించే
పరీక్షల కోర్సులు కనబడును.
7. మీకు కావాల్సిన
కోర్సు మీద క్లిక్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
0 Komentar