AP: Online Teacher’s
Attendance Process Starts from August 2022
ఏపీ: ఆన్‌లైన్ లో ఉపాధ్యాయుల
హాజరు ప్రక్రియ ఆగస్టు 2022 నుండి ప్రారంభం
ఉపాధ్యాయులకు
వచ్చేనెల నుంచి ఆన్లైన్ హాజరును ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇందుకు కొత్త యాప్ ను
పాఠశాల విద్యాశాఖ తీసుకురాబోతోంది. ఉదయం
పాఠశాల ఆవరణకు వచ్చిన తర్వాత ఉపాధ్యాయులు ఈ యాప్ లోనే హాజరు వేసేలా దీన్ని
రూపొందించారు. ఈ యాప్ లోనే అన్ని సెలవులు నమోదుచేయాలి. ఉపాధ్యాయులు తమ సొంత సెల్ ఫోన్
లో ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని, ఆన్లైన్లో హాజరు నమోదు చేయాలి. పాఠశాల విద్యాశాఖ అధికారులు
మంగళ వారం నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు.
వచ్చే నెలలో
నిర్వహించే ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణకు ఈనెల 28న ఉండే విద్యార్థుల సంఖ్యను ఆధారంగా తీసుకోనున్నారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు ఆన్లైన్లో నిర్వహించనున్నందున టీచర్ ఇన్ఫర్మేషన్
సిస్టంలో వివరాలు నమోదు చేయాలి.
0 Komentar