AP: Videshi Vidya Deevena for Higher
Studies in Top 200 Universities Abroad – GO Released
ఏపీ: ‘విదేశీ
విద్యా దీవెన' గురించి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ – మార్గదర్శకాలు
ఇవే
విదేశాల్లో
ఉన్నత విద్య చదివే విద్యార్థులకు ఆర్థిక చేయూత అందించేందుకు విదేశీ విద్య పథకాన్ని
రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ అమల్లోకి తీసుకురానుంది. 'జగనన్న విదేశీ విద్యా దీవెన' పేరుతో దీన్ని అమలు
చేయనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం సోమవారం ప్రకటించింది.
విదేశీ విద్య
పథకాన్ని గత ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, కాపు, ఇతర సామాజికవర్గాలకు చెందిన విద్యార్థులకు అమలు చేశారు.
టాప్ 200 విదేశీ విశ్వవిద్యాలయాల్లో సీట్లు సాధించిన వారందరికీ సంతృప్తకర స్థాయిలో
ఫీజు రీయింబర్స్ మెంట్ అమలు చేస్తామని ప్రకటించింది.
విదేశీ
విద్యా దీవెన పథకం మార్గదర్శకాలు ఇవే
* ఏపీలో స్థానికుడై 35 ఏళ్లలోపు వయసు కలిగి, ఏడాదికి రూ. 8 లక్షల్లోపు ఆదాయం ఉన్నవారు పథకానికి అర్హులు.
* కుటుంబంలో
ఒక్కరికి మాత్రమే పథకాన్ని వర్తింపజేస్తారు.
* ఆర్థికంగా
వెనకబడిన అగ్రకులాల వారికీ లబ్ధిని అందిస్తారు.
* పథకానికి
అరుల గుర్తింపు కోసం ఏటా జనవరి- మే, సెప్టెంబర్-
డిసెంబర్ మధ్య నోటిఫికేషన్ జారీ చేస్తారు.
* ప్రభుత్వ
ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ ద్వారా అర్హులను ఎంపిక చేస్తారు.
* క్యూఎస్
ర్యాంకింగ్స్ లో ప్రపంచంలోని మొదటి 200 విశ్వవిద్యాలయాల్లో సీటు సాధించిన
విద్యార్థుల ఖర్చును ప్రభుత్వం భరిస్తుంది.
* మొదటి
100 ర్యాంకుల్లో ఉన్న విశ్వవిద్యాలయాల్లో సీటు సాధిస్తే
పూర్తి బోధనా రుసుము చెల్లిస్తారు.
* 100
నుంచి 200 ర్యాంకుల్లోపు విశ్వవిద్యాలయాలకు ఎంపికయితే రూ. 50 లక్షల వరకు అందిస్తారు.
* ఈ
మొత్తాన్ని నాలుగు వాయిదాల్లో నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ల్యాండింగ్
పర్మిట్ లేదా ఐ-94 ఇమ్మిగ్రేషన్ కార్డు సాధించగానే మొదటి
వాయిదా చెల్లిస్తారు. మొదటి సెమిస్టర్ లేదా టర్మ్ ఫలితాలు రాగానే రెండో వాయిదా,
రెండో సెమిస్టర్ ఫలితాలు రాగానే మూడో వాయిదా, నాలుగో
సెమిస్టర్/ ఫైనల్ ఫలితాలు రాగానే నాలుగో వాయిదా మొత్తాన్ని అందజేస్తారు.
* పీహెచ్డీ,
ఎంబీబీఎస్ విద్యార్ధులకు ఏడాది/ సెమిస్టర్ వారీగా కోర్సు పూర్తయ్యే
వరకు ఫీజు రీయింబర్స్ మెంట్ వర్తింపజేస్తారు.
SOCIAL WELFARE DEPARTMENT - Jagananna
Videshi Vidya Deevena - For Higher Studies in Top 200 Universities abroad - For
SC/ST/BC/Minority/EBC including Kapu Students - Policy and Implementation
Framework in supersession of all previous orders – Orders – Issued.
G.O.Ms.No.39, Dated: 11-07-2022
0 Komentar