APPSC: Admission Test for Boys & Girls
Students into RIMC for VIII Class for The Term July-2023
రాష్ట్రీయ ఇండియన్ మిలటరీ కాలేజీలోకి బాలురకు మరియు బాలికలకు 8వ తరగతిలోకి ప్రవేశ పరీక్ష జూలై-2023 టర్మ్ – వివరాలు ఇవే
భారత
ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డెహ్రాడూన్ లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ
కాలేజీ(ఆర్ఐఎంసీ)లో జులై 2023 టర్మ్ ఎనిమిదో తరగతి ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్ కు
చెందిన బాలురు, బాలికల నుంచి ఆంధ్రప్రదేశ్
పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) దరఖాస్తులు కోరుతోంది.
ఆర్ఐఎంసీలో
ఎనిమిదో తరగతి ప్రవేశాలు
అర్హత: ఏడో
తరగతి చదువుతున్న లేదా ఎడో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు.
వయసు:
01.07.2022 నాటికి పదకొండున్నర ఏళ్లకు తగ్గకుండా పదమూడేళ్లకు మించకుండా ఉండాలి.
02.07.2010 - 01.01.2012 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం:
రాత పరీక్ష, వైవా వాయిస్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
పరీక్షా
విధానం: రాత పరీక్షలో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. అవి మ్యాథమేటిక్స్, జనరల్ నాలెడ్జ్, ఇంగ్లిష్ నుంచి
ప్రశ్నలు ఉంటాయి. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు వైవా వాయిస్
నిర్వహిస్తారు. దీనిలో కనీస ఉత్తీర్ణత మార్కులు 50% ఉండాలి. ఈ రెండింటిలో అర్హత సాధించిన అభ్యర్థులకు చివరిగా
మెడికల్ టెస్ట్ ఉంటుంది.
దరఖాస్తు
విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు
ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ/ ఎస్టీ
అభ్యర్థులు రూ.555 చెల్లించాలి.
దరఖాస్తులను
పంపడానికి చిరునామా: అసిస్టెంట్ సెక్రటరీ(ఎగ్జామ్స్), ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్, న్యూ హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్ మెంట్స్ బిల్డింగ్, రెండో అంతస్తు, ఆర్టీఏ కార్యాలయం
దగ్గర,
ఎంజీ రోడ్డు, విజయవాడ.
ముఖ్యమైన
తేదీలు:
దరఖాస్తుకు
చివరి తేది: 15.10.2022.
పరీక్ష తేది:
03.12.2022.
0 Komentar