APVVP & DPHFW Recruitment 2022: Apply for 823 Civil Assistant Surgeon Posts – Revised Merit List and Selection List Released
ఏపీలో 823 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు – తుది జాబితా విడుదల
========================
UPDATE 27-08-2022
823 సివిల్ అసిస్టెంట్ సర్జన్ (CAS) పోస్టుల భర్తీ ప్రక్రియలో
భాగంగా తుది సెలక్షన్ జాబితా విడుదలైంది. http://hmfw.ap.gov.in/
వెబ్సైట్లో తొలుత
ప్రాథమిక జాబితాను ప్రకటించిన అధికారులు.. దానిపై అభ్యంతరాలు స్వీకరించారు.
క్షుణ్నంగా పరిశీలించిన అనంతరం రూల్ఆఫ్ రిజర్వేషన్ ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేశారు.
========================
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని ప్రజారోగ్య, కటుంబ
సంక్షేమ డైరెక్టరేట్ కార్యాలయం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాథమిక ఆరోగ్య
కేంద్రాలు, ఏపీవీవీపీ ఆసుపత్రులు, డీఎంఈ విభాగాల్లో పని చేయడానికి కింది పోస్టుల భర్తీకి
దరఖాస్తులు కోరుతోంది.
సివిల్
అసిస్టెంట్ సర్జన్లు
మొత్తం
పోస్టులు: 823
1) ప్రజారోగ్య, కటుంబ సంక్షేమ డైరెక్టరేట్ లో: 635 పోస్టులు
2) ఏపీవీవీపీ ఆసుపత్రుల్లో: 188 పోస్టులు
అర్హత:
ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి.
వయసు: 01.07.2022 నాటికి 42 ఏళ్లు మించకుండా
ఉండాలి.
జీతభత్యాలు:
నెలకు రూ.61960 చెల్లిస్తారు.
ఎంపిక విధానం:
అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దీనికి ఇంటర్వ్యూలు లేవు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 06.08.2022.
0 Komentar