CBSE Result 2022:
Class 10th Results Declared
సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల
సెంట్రల్
బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10వ తరగతి
ఫలితాలు వచ్చేశాయ్. శుక్రవారం మధ్యాహ్నం బోర్డు ఈ ఫలితాలను విడుదల చేసింది. ఈ
ఫలితాలను బోర్డు అధికారిక వెబ్ సైట్ల ద్వారా తెలుసుకోవచ్చని బోర్డు వెల్లడించింది.
విద్యార్థులు తమ రోల్ నంబర్, పుట్టిన తేదీ, స్కూల్ నంబర్లతో ఈ ఫలితాలను పొందవచ్చు. కాగా.. ఈ ఉదయమే
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు
విడుదలైన విషయం తెలిసిందే.
అయితే, సీబీఎస్ఈ ఒకేరోజు పది, 12 తరగతుల ఫలితాలు విడుదల చేయడం ఇదే తొలిసారి. ఈ ఏడాది 94. 40శాతం ఉత్తీర్ణత నమోదైనట్టు బోర్డు వెల్లడించింది. బాలికల
ఉత్తీర్ణతా శాతం 95.21శాతంగా ఉండగా..
బాలుర ఉత్తీర్ణత శాతం 93. 80శాతంగా ఉన్నట్టు
తెలిపింది. బాలురతో పోలిస్తే బాలికల ఉత్తీర్ణతా 1.41శాతం అధికంగా ఉన్నట్టు తెలిపింది. అలాగే, ట్రాన్స్
జెండర్ ఉత్తీర్ణతా శాతం 90శాతంగా ఉందని బోర్డు
వెల్లడించింది.
సీబీఎస్ఈ పదో
తరగతి పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి మే 24 వరకు జరగాయి. దేశవ్యాప్తంగా 7,046 సెంటర్లలో జరిగిన సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలకు 21,16,209 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 8,94,993 మంది బాలికలు కాగా.. 12,21,195మంది బాలురు.
గత ఐదేళ్లలో ఉత్తీర్ణత ఇలా..
సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాల్లో 2017 ఉత్తీర్ణతా శాతం 93.12% గా ఉండగా.. 2018లో 86.7%, 2019లో 91.10%, 2020లో 91.46%, 2021లో 99.04%గా నమోదైంది.
0 Komentar