CISCE: ISC 12th
Result 2022 Declared
సీఐఎస్ సీఈ: ఐఎస్‌సీ 12వ తరగతి పరీక్షల ఫలితాలు
విడుదల
ఐఎస్‌సీ (ఇండియన్
స్కూల్ సర్టిఫికెట్) 12వ తరగతి ఫలితాలు (ISC 12th
Results) విడుదలయ్యాయి. ఈ ఫలితాలను కౌన్సిల్
ఫర్ ద ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ (సీఐఎస్ సీఈ) జులై 24న విడుదల చేసింది. ఈ ఏడాది తొలిసారి రెండు టర్మ్ లుగా
పరీక్షలు నిర్వహించినట్టు బోర్డు కార్యదర్శి గెర్రీ అరథూన్ తెలిపారు.
ఈ పరీక్షల్లో
99.52
శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. బాలురతో పోలిస్తే బాలికలే
స్వల్ప తేడాతో పైచేయి సాధించారని వెల్లడించారు. ఈ ఏడాది 99.75 శాతం మార్కులతో 18మంది
విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ 1 ర్యాంకులో నిలవగా.. 99.50 శాతం మార్కులతో 58మంది. రెండో
ర్యాంకు,
99.25శాతం మార్కులతో 78మంది థర్డ్ ర్యాంకులో మెరిశారని అరథూన్ చెప్పారు. ఫలితాలు తెలుసుకోవాలంటే
విద్యార్థులు యూనిక్ ఐడింటిటీ నంబర్ తో పాటు ఇండెక్స్ నంబర్, క్యాప్చా కోడ్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
0 Komentar