Commonwealth Games: Weightlifter Sanket
Sargar gives India its first medal
కామన్వెల్త్
గేమ్స్: భారత్‌కు తొలి పతకాన్ని అందించిన వెయిట్ లిఫ్టర్ సంకేత్ సర్గార్
కామన్వెల్త్
గేమ్స్ లో భారత్ పతకాల ఖాతాను తెరిచింది. వెయిట్ లిఫ్టర్ సంకేత్ సర్గార్ 55 కేజీల
విభాగంలో రజత పతకం గెలుచుకున్నాడు. క్లీన్ అండ్ జెర్క్ లో 135 కేజీలు, స్నాట్స్ లో 118 కేజీలు ఎత్తాడు. మొత్తం 248 కేజీలు ఎత్తి
రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నాడు.
క్లీన్ అండ్
జెర్క్ లో మొదటి ప్రయత్నంలో 135 కేజీలు ఎత్తిన సర్దార్.. మిగిలిన రెండు
ప్రయత్నాల్లో 139 కేజీలను ఎత్తలేకపోయాడు. ఇక మలేషియాకు చెందిన బిన్ మహమద్ అనిఖ్
కేవలం ఒకే ఒక్క కేజీ అదనంగా ఎత్తి స్వర్ణ పతకం ఎగరేసుకుపోయాడు.
స్నాచ్ లో
107 కేజీలను మాత్రమే ఎత్తిన అనిఖీ.. క్లీన్ అండ్ జెర్క్ లో మాత్రం 142 కేజీలను
ఎత్తాడు. దీంతో మొత్తం 249 కేజీల బరువును మోసి గోల్డ్ మెడల్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.
శ్రీలంకకు చెందిన దిలాంక ఇసురు కుమార యోద7 225 కేజీలతో (స్నాచ్ -105, క్లీన్ అండ్ జెర్క్ - 190) మూడో స్థానంలో నిలిచి కాంస్య
పతకం సాధించాడు.
#SanketSargar opens India’s Medal account with a Silver (248 kg) in Men’s 55 kg weightlifting at #B2022 #CWG2022. Missed the 🥇 by a whisker, but India is really proud of you.
— Anurag Thakur (@ianuragthakur) July 30, 2022
Congratulations Sanket!#Cheer4India pic.twitter.com/NjSuUJHQe2
0 Komentar