CTET December 2022: All the Details Here
సీటెట్
డిసెంబర్ 2022: అన్నీ ముఖ్యమైన వివరాలు ఇవే
====================
UPDATE
03-03-2023
సీటెట్ డిసెంబర్ 2022 – ఫలితాలు విడుదల
సెంట్రల్ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (CTET) డిసెంబర్-2022 ఫలితాలను మార్చి 3న సీబీఎస్ఈ
విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఈ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత విధానంలో గతేడాది
డిసెంబర్ 28 నుంచి ఫిబ్రవరి 7, 2023 వరకు జరిగిన
విషయం తెలిసిందే.
సీటెట్ ను 32 లక్షలకు పైగా అభ్యర్థులు రాశారు. పరీక్ష సమాధానాల ఫైనల్ కీ ఫిబ్రవరి 14న విడుదలైంది. అభ్యర్థులు సీబీఎస్ఈ సీటెట్ అధికారిక వెబ్సైట్లో రోల్ నంబర్
నమోదు చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు. సీటెట్ స్కోర్ లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ కలిగి
ఉంటుంది. సీటెట్ స్కోర్ కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో
పరిగణనలోకి తీసుకుంటారు.
====================
14-02-2023
ప్రొవిజనల్ ఆన్సర్ ‘కీ’లు విడుదల
====================
UPDATE 26-12-2022
అడ్మిట్ కార్డులు విడుదల
====================
UPDATE
21-12-2022
ప్రీ-అడ్మిట్ కార్డ్ విడుదల
====================
UPDATE 29-11-2022
CTET Form Correction 2022 Application
Correction Dates
ఆన్‌లైన్ కరక్షన్
తేదీలు: 28.11.2022 నుండి 03.12.2022 వరకు
====================
CTET: సెంట్రల్
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) డిసెంబర్-2022
ఉపాధ్యాయ
వృత్తిని కెరీర్ గా ఎంచుకునే వారి కోసం ప్రతీ ఏటా సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ
టెస్ట్ (సీటెట్) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షను సెంట్రల్ బోర్డ్ ఆఫ్
సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్వహిస్తోంది. సీటెట్ పరీక్ష ప్రతి ఏడాది
రెండుసార్లు జరుగుతుంది. తాజాగా డిసెంబర్-2022 ఏడాదికి సంబంధించిన సీటెట్ నోటిఫికేషన్ విడుదలైంది. 16వ ఎడిషన్ సీటెట్ రిజిస్టేషన్లు అక్టోబర్ 31 నుంచి ప్రారంభంకానున్నాయి. పరీక్షను కంప్యూటర్ ఆధారితంగా
నిర్వహించనున్నారు.
సెంట్రల్
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) డిసెంబర్-2022
పరీక్ష
విధానం: పరీక్ష మొత్తం రెండు పేపర్లను కలిగి ఉంటుంది. మొదటి పేపర్ ఒకటి నుంచి ఐదు
తరగతులకు బోధించాలనుకునే వారికి కోసం, రెండో పేపర్
ఆరు నుంచి తొమ్మిదో తరగతులకు బోధించాలనుకునే వారి కోసం నిర్వహిస్తారు. సీటెట్
స్కోర్ లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. పరీక్షను 20 భాషలలో నిర్వహిస్తారు.
సీటెట్ స్కోర్ కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో
పరిగణనలోకి తీసుకుంటారు.
అర్హతలు:
పేపర్-1: 50
శాతం మార్కులతో పన్నెండో తరగతితో పాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో రెండేళ్ల డిప్లొమా
(డీఈఎల్ఈడీ) / డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (ప్రత్యేక విద్య) లేదా డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.
పేపర్-2: 50
శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీతో పాటు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ /
బ్యాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్ (బీఈడీ) / బీఈడీ (ప్రత్యేక విద్య) లేదా సీనియర్
సెకండరీతో పాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(బీఈఎల్ ఈడీ)/
బీఎస్సీఈడీ/ బీఏఈడీ/ బీఎస్సీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు
రుసుము: జనరల్ / ఓబీసీ కేటగిరీలకు రూ.1000 (పేపర్ 1 లేదా 2 మాత్రమే), రూ.1200 (పేపర్ 1 & 2 రెండూ). ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు: రూ.500 (పేపర్ 1 లేదా 2 మాత్రమే), రూ.600 (పేపర్ 1 & 2 రెండూ).
ముఖ్యమైన
తేదీలు:
ఆన్లైన్
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 31-10-2022.
ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేది: 24-11-2022.
ఫీజు
చెల్లింపు చివరి తేది: 25-11-2022.
కంప్యూటర్
ఆధారిత పరీక్ష తేదీలు: డిసెంబర్, 2022 నుంచి జనవరి, 2023 మధ్య.
====================
No.: CBSE/CTET/Dec-2022 Dated:
14.07.2022
PUBLIC NOTICE
====================
The Central Board of Secondary Education
will conduct the 16th edition of Central Teacher Eligibility Test (CTET) in CBT
(Computer Based Test) mode in December 2022(exact date will be intimated on the
admit card of the candidate). The test will be conducted in 20 (Twenty)
languages throughout the country. The detailed Information Bulletin containing
details of examination, syllabus, languages, eligibility criteria, examination
fee, examination cities and important dates will be available on CTET official
website https://ctet.nic.in shortly and the aspiring candidates are requested
to download the Information Bulletin from the above mentioned website only and
read the same carefully before applying. The aspiring candidates have to apply online
only through CTET website i.e. https://ctet.nic.in. The dates for online application-process
will be intimated during the course of time.
The application fee applicable for CTET
Dec-2022 is as under:
================
================
CTET DEC-2021 ALL
THE DETAILS FOR REFERENCE
================
0 Komentar