ECI Announces Advance Registration for
17+ to Enroll Their Name in Voter's List
17
ఏళ్లకే ఓటరు జాబితాలో పేరు నమోదుకు ముందస్తు రిజిస్ట్రేషన్ అవకాశం – ECI కీలక నిర్ణయం
ఓటర్
జాబితాలో పేరు నమోదు చేసుకుని గుర్తింపు కార్డు పొందేందుకు ఎవరైనా 18 ఏళ్లు నిండే వరకు వేచి చూడాల్సిందే. జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయసులోకి
అడుగు పెట్టిన వారు మాత్రమే ఓటర్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. కానీ, 18 ఏళ్లు నిండే వరకు వేచి చూడాల్సిన అవసరం లేదని ప్రకటించింది
కేంద్ర ఎన్నికల సంఘం. 17 ఏళ్లు నిండిన యువత
ఓటర్ కార్డు కోసం ముందస్తుగా దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు
స్పష్టం చేసింది.
జనవరి 1వ తేదీ ఎప్పుడొస్తుందా అని వేచి చూడకుండా 17 ఏళ్ల వయసు దాటిన వారు ఓటర్ కార్డుకు దరఖాస్తు
చేసుకోవచ్చు. అయితే.. 18 ఏళ్లు నిండిన
తర్వాతనే ఓటర్ కార్డు అందిస్తారు. కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజివ్ కుమార్, ఎలక్షన్ కమిషనర్ అనుప్ చంద్ర పాండేల నేతృత్వంలోని ఈసీఐ..
అన్ని రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు, ఈఆర్‌ఓ, ఏఈఆర్‌ఓలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. 17 ఏళ్లుపైబడిన యువత ఓటర్ జాబితాలో పేరు నమోదుకు ముందస్తుగా
దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని సూచించింది. ప్రజల్లో అవగాహన
కల్పించాలని తెలిపింది.
DOWNLOAD
PRESS NOTE 28-07-2022
Youngsters above 17 years of age can now apply in advance for having their names enrolled in Voter’s list and not necessarily have to await the pre-requisite criterion of attaining the age of 18 years on 1st January of a year: ECI pic.twitter.com/DhAi7NN1Zo
— ANI (@ANI) July 28, 2022
0 Komentar