Free COVID Booster Doses to be Given to
All Above 18 Years from July 15
కోవిడ్ టీకా:
జులై 15 నుంచి మూడో డోసు (ప్రికాషన్ డోసు) అందరికీ ఉచితం
దేశవ్యాప్తంగా
కరోనా వైరస్ (Coronavirus) మరోసారి విజృంభిస్తోన్న వేళ..
వ్యాక్సినేషన్ పై (Vaccination) కేంద్ర ప్రభుత్వం
మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. 18 నుంచి 50 ఏళ్ల వారికి మూడో డోసు (Precaution Dose) ను ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా పంపిణీ చేసేందుకు
సిద్ధమైనట్లు సమాచారం. 15 రోజుల పాటు కొనసాగే
ఈ ప్రత్యేక కార్యక్రమం జులై 15 నుంచి ప్రారంభం
కానున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. 75వ
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని జరుపుకుంటోన్న 'ఆజాదీకా అమృత్ మహాత్సవ్ లో భాగంగా ప్రికాషన్ డోసు (Booster) పంపిణీ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టేందుకు ప్రభుత్వం
సిద్ధమైందని తెలిపాయి.
'దేశ జనాభాలో
మెజారిటీ ప్రజలు తొమ్మిది నెలల క్రితం రెండు డోసులు తీసుకున్నారు. అయితే, రెండో డోసు. తీసుకున్న ఆరు నెలల తర్వాత వ్యాక్సిన్ వల్ల
పొందే యాంటీబాడీలు క్రమంగా క్షీణించిపోతున్నట్లు భారత వైద్య పరిశోధనా మండలి (ICMR)తోపాటు ఇతర అంతర్జాతీయ పరిశోధనా సంస్థలు చెబుతున్నాయి. ఈ
క్రమంలో బూస్టర్ డోసు ఇవ్వడం వల్ల రోగనిరోధక స్పందనలను మరింత పెంచవచ్చని
సూచిస్తున్నాయి' అని జాతీయ వ్యాక్సినేషన్ ప్రక్రియలో
కీలకంగా వ్యవహరిస్తోన్న ఓ అధికారి వెల్లడించారు. ఈ క్రమంలో 18ఏళ్ల వయసు పైబడిన వారికి ప్రత్యేక కార్యక్రమం ద్వారా
బూస్టర్ డోసును (Booster Dose) ఉచితంగా పంపిణీ చేసే
యోచనలో ప్రభుత్వం ఉందన్నారు.
జులై 15 నుంచి ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో వీటిని పంపిణీ
చేయనున్నట్లు తెలిపారు. అధికారిక లెక్కల ప్రకారం, దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కు అర్హులైన వారిలో 96శాతం మంది ఒకడోసు తీసుకోగా.. 87శాతం మంది రెండు డోసులు తీసుకున్నారు. ప్రికాషన్ డోసుగా
పిలుస్తోన్న మూడో డోసును మాత్రం 18 నుంచి 59ఏళ్ల వయసు వారికి కేవలం ప్రైవేటు కేంద్రాల్లోనే పంపిణీ
చేస్తున్నారు. దేశంలో 77కోట్ల మంది ఈ వయసు
వారు ఉండగా అందులో కేవలం ఒకశాతం మాత్రమే ఇప్పటివరకు ప్రికాషన్ డోసును
తీసుకున్నారు.
60 ఏళ్ల వయసు పైబడిన వారితోపాటు ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు మాత్రం బూస్టర్ డోసును ఉచితంగా
అందిస్తున్నారు. వీరి సంఖ్య 16కోట్లు ఉండగా వారిలో
26శాతం మాత్రమే మూడో డోసు తీసుకున్నట్లు గణాంకాలు
చెబుతున్నాయి. మరోవైపు కరోనా వ్యాక్సిన్ రెండు, మూడు డోసుల
మధ్య వ్యవధిని తొమ్మిది నుంచి ఆరు నెలలకు తగ్గించింది. దీంతో రెండో డోసు తీసుకొని
ఆరు నెలలు పూర్తైన వారు మూడో డోసును (Booster Dose) తీసుకోవచ్చు.
India is celebrating 75 years of independence. On the occasion of Azadi ka Amrit Kaal, it has been decided that from 15th July 2022 till the next 75 days, citizens above 18 years of age will be given booster doses free of cost: Union Minister Anurag Thakur pic.twitter.com/Qai76dFVW7
— ANI (@ANI) July 13, 2022
0 Komentar