Google Maps Launches ‘Street View‘ Service in India
ఇండియా లో గూగుల్ మ్యాప్స్ ‘స్ట్రీట్ వ్యూ‘ సేవలు – హైదరాబాద్, బెంగళూరు సహా తొలుత 10 నగరాల్లో ఇప్పటికే ఈ సేవలు ప్రారంభం
=====================
మన దేశంలో స్ట్రీట్ వ్యూ సేవలను (Street View) గూగుల్ (google) మళ్లీ ప్రారంభించింది. దేశీయ టెక్ సంస్థలైన టెక్ మహీంద్రా, జెనిసిస్ తో కలిసి ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
గూగుల్ స్ట్రీట్
వ్యూ ద్వారా ఓ వీధిని 360 డిగ్రీల్లో పనోరమా షాట్స్ లో వీక్షించొచ్చు. కంప్యూటర్
లో గానీ,
మొబైల్ లో గానీ గూగుల్ మ్యాప్స్ ఓపెన్ స్ట్రీట్ వ్యూలను చూడొచ్చు.
FINALLY! Goddamn, yes
— Abhishek Baxi (@baxiabhishek) July 27, 2022
Google launches Street View for Google Maps in India, in collaboration with Genesys and Tech Mahindra.
Available for 10 cities starting today; 50 cities by the end of the year. #GoogleMaps pic.twitter.com/FlAbwSvcSZ
గూగుల్ 15
ఏళ్ల క్రితమే స్ట్రీట్ వ్యూ సేవలను ప్రారంభించగా.. 2011లో తొలిసారి భారత్ కు
తీసుకొచ్చింది. స్ట్రీట్ వ్యూ పేరిట చిత్రాలు సేకరించడం పై అప్పట్లో ప్రభుత్వం
అడ్డు చెప్పింది. ఈ టెక్నాలజీ వల్ల భద్రతాపరంగా ముప్పు పొంచి ఉందన్న కారణంతో
2016లో దీనిపై నిషేధం విధించింది. ఈ సేవల వల్ల ఉగ్రమూకలు సులువుగా రక్షణ శాఖకు
చెందిన వివరాలను తెలుసుకునే అవకాశం కల్పిస్తుందన్న భావన అప్పట్లో వ్యక్తమవ్వడంతో
ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో స్థానిక టెక్ సంస్థలతో జట్టు కట్టి
తాజాగా గూగుల్ వీటిని తీసుకొచ్చింది.
స్ట్రీట్
వ్యూతో పాటు ప్రమాదాలను అరికట్టేందుకు మ్యాప్స్ లో స్పీడ్ లిమిట్ ఆప్షన్ సైతం
గూగుల్ తీసుకొచ్చింది. బెంగళూరు, చండీగఢ్ లో ఈ సేవలను
ప్రారంభించినట్లు తెలిపింది. స్థానిక ట్రాఫిక్ పోలీసుల సాయంతో ఈ సేవలను
ప్రారంభిస్తున్నట్లు పేర్కొంది. దీని ద్వారా తాము ప్రయాణిస్తున్న రహదారిపై
గరిష్ఠంగా ఎంత వేగం వెళ్లాచ్చో గూగుల్ మ్యాప్ సూచిస్తుంది. దీంతో పాటు సెంట్రల్
పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో కలిసి గాలి నాణ్యతను తెలుసుకునే సదుపాయం సైతం
తీసుకొస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. దీనిద్వారా యూజర్ కోరుకున్న చోట ఎయిర్
క్వాలిటీని చెక్ చేయొచ్చు. త్వరలోనే పలు నగరాల్లో ఈ సేవలను ప్రారంభించనున్నట్లు
గూగుల్ తెలిపింది.
Google Maps has launched Street View in India in collaboration with Tech Mahindra and Genesys, marking the first time in the world the service will be handled completely by local partners.@Sourabh_Lele #Google #GoogleMaps #TechMahindrahttps://t.co/HAcOcILivB
— Business Standard (@bsindia) July 27, 2022
0 Komentar