How to Open SBI Fixed
Deposit (FD) Account Online?
SBI FD: ఎస్బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాను ఆన్‌లైన్‌లో ఎలా తెరవాలి?
ఎస్బీఐ రూ. 2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను
చివరి సారిగా జూన్ 14వ తేదీన సవరించింది.
సవరణ తర్వాత బ్యాంకు ఇప్పుడు సాధారణ ప్రజలకు 2.90% - 5.50%, సీనియర్ సిటిజన్లకు 3. 40% - 6.30% వరకు వడ్డీ రేటును
అందిస్తోంది. పన్ను ఆదా చేసే ఫిక్స్ డిపాజిట్లపై ఎస్ బీఐ సీనియర్ సిటిజన్లకు 5.50%, 6.30% వడ్డీ రేటును అందిస్తోంది.
ఎస్బీఐలో
ఫిక్స్ డిపాజిట్లను బ్యాంకుకు వెళ్లి ఎఫ్ డీలను చేయడం చాలా మందికి తెలిసిందే. కానీ
ఆన్లైన్ లో కూడా ఫిక్స్ డిపాజిట్ చేయవచ్చు. అది ఎలాగో తెలుసుకొందాము.
1) https://retail.onlinesbi.sbi/retail/login.htm కి లాగిన్ అయ్యి 'Continue to login' పై క్లిక్ చేయండి.
2) ఇప్పుడు మీ యూజర్ నేమ్, పాస్ వర్డ్ ఎంటర్
చేసి 'లాగిన్' పై క్లిక్ చేయండి.
3) ఆ తర్వాత 'డిపాజిట్ & ఇన్వెస్ట్మెంట్' ఎంపికపై
క్లిక్ చేసి, డ్రాప్-డౌన్ మెను కింద, 'ఫిక్స్ డిపాజిట్' పై సెలక్ట్
చేయండి.
4) ఇప్పుడు 'ఫిక్స్ డిపాజిట్ (e-TDR/E-STDR)' పై క్లిక్ చేసి ఆపై మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కి పంపిన 'ఓటీపీని నమోదు చేయండి.
5) అనంతరం 'ప్రోసీడ్ పై క్లిక్ చేసి మీరు
డిపాజిట్ చేయాలనుకుంటున్న మొత్తాన్ని నమోదు చేయండి.
6) మీరు సీనియర్ సిటిజన్ అయితే ఆ కేటగిరిని టిక్ చేయండి.
7) ఇప్పుడు STDR నుండి పెట్టుబడి రకాన్ని క్యుములేటివ్
ఎంపిక గానీ TDR నుండి నాన్-క్యుములేటివ్ ఎంపిక గాని
సెలక్ట్ చేసుకోండి.
8) తర్వాత డిపాజిట్ కాలవ్యవధి, మెచ్యూరిటీ సూచనలను
ఎంచుకోండి.
9) నిబంధనలు, షరతులను అంగీకరించి 'సబ్ మిట్’ పై క్లిక్ చేయండి.
10) సమర్పించిన వివరాలను ధ్రువీకరించుకొని 'Confirm'పై క్లిక్ చేయండి.
11) మీకు ఇప్పుడు స్క్రీన్ పై ‘ఎఫ్ డీ’ విజయవంతం అయినట్లు చూపిస్తుంది. మీ ఫిక్స్
డ్ డిపాజిట్ ఖాతా వివరాలు Account Summaryలో చూడవచ్చు.
0 Komentar