Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IBPS CRP CLERKS-XII Recruitment 2023-24: Mains Results Released

 

IBPS CRP CLERKS-XII Recruitment 2023-24: Mains Results Released

ఐబీపీఎస్-సీఆర్ పీ XII 6035 క్లర్క్ పోస్టులు – మెయిన్స్ పరీక్ష ఫలితాలు విడుదల

=======================

UPDATE 02-04-2023

మెయిన్స్ పరీక్ష ఫలితాలు విడుదల

ప్రభుత్వ బ్యాంకుల్లో 6,035 క్లర్క్ (సీఆర్పీ క్లర్క్స్ XII- 2022) ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రధాన పరీక్ష ఫలితాలను ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్(ఐబీపీఎస్) ఏప్రిల్ 1న విడుదల చేసింది. దేశవ్యాప్తంగా క్లర్క్ నియామక ప్రధాన పరీక్షలను గతేడాది అక్టోబర్ లో ఐబీపీఎస్ నిర్వహించింది. ఈ మేరకు ఐబీపీఎస్ ఫలితాలను ప్రకటించింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ వివరాలు నమోదు చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు. ఫలితాలకు సంబంధించిన లింక్ ఏప్రిల్ 30 వరకు అందుబాటులో ఉంటుంది. మెయిన్స్ లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది.

CLICK FOR RESULTS

DETAILS PAGE

WEBSITE

=======================

UPDATE 29-09-2022

ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్(సీఆర్ పీ-XII, 2023-24) పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థుల స్కోరు కార్డు వివరాలను అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. ప్రిలిమ్స్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను చూసుకోవచ్చు. సెప్టెంబరు 3, 4 తేదీల్లో ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రధాన పరీక్షలు అక్టోబర్ 8న నిర్వహించనున్నట్లు ఐబీపీఎస్ వెల్లడించింది.

మెయిన్స్ పరీక్షా తేదీ: అక్టోబర్ 8

CLICK FOR RESULTS

RESULTS DETAILS PAGE

WEBSITE

======================

ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) 2023 - 2024 సంవత్సరానికి కామన్ రిక్రూట్ మెంట్ ప్రాసెస్(సీఆర్ పీ)-XII నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. క్లరికల్ కేడర్ పోస్టులు

మొత్తం ఖాళీలు: 6035

తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: ఆంధ్రప్రదేశ్-209, తెలంగాణ-99.

ఉద్యోగాలు కల్పిస్తున్న బ్యాంకులు: బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్ తదితరాలు.

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.

వయసు: 01.07.2022 నాటికి 20-28 ఏళ్ల మధ్య ఉండాలి.

వయసు సడలింపు: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయసులో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

ప్రిలిమినరీ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. ఇంగ్లిష్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ లో ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 60 నిమిషాలు. మెయిన్స్ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. జనరల్ అవేర్‌నెస్, జనరల్ ఇంగ్లిష్, రీజనింగ్, కంప్యూటర్ ఆప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ లో ప్రశ్నలు వస్తాయి. సమయం 160 నిమిషాలు కేటాయిస్తారు. ప్రిలిమ్స్, మెయిన్ పరీక్షకు తప్పు సమాధానానికి నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.07.2022

దరఖాస్తులకి చివరి తేది: 21.07.2022

ప్రిలిమినరీ పరీక్ష: సెప్టెంబర్ 2022.

మెయిన్ పరీక్ష: అక్టోబరు 2022.

NOTIFICATION

APPLY HERE  (Turn Your Mobile)

SCHEDULE DETAILS

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags