IIT Madras Tops Ministry of Education’s
India Rankings 2022
వరుసగా
నాలుగో ఏడాది ఉత్తమ విద్యా సంస్థ గా ఐఐటీ మద్రాస్ – NIRF ర్యాంకులను విడుదల చేసిన కేంద్ర విద్యాశాఖ
ఇండియాలోని అత్యుత్తమ
ఉన్నత విద్యాసంస్థల జాబితాలో ఐఐటీ మద్రాస్ వరుసగా నాలుగో ఏడాది తన మొదటి
స్థానాన్ని నిలుపుకొంది. ఉత్తమ విశ్వవిద్యాలయాల విభాగంలో ఐఐఎస్ సీ బెంగళూరు మొదటి
స్థానాన్ని ఆక్రమించింది. నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాకింగ్ ఫ్రేమ్ వర్క్ (NIRF) కింద కేంద్ర విద్యాశాఖ ఆ జాబితాను రూపొందించింది. శుక్రవారం
విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దీనిని విడుదల చేశారు.
మొత్తంగా
విద్యాసంస్థల జాబితాలో.. ఐఐటీ మద్రాస్ మొదటిస్థానంలో ఉండగా, ఐఐఎస్ సీ బెంగళూరు రెండు, ఐఐటీ బాంబే మూడో స్థానంలో ఉన్నాయి. విశ్వవిద్యాలయాల పరంగా చూసుకుంటే.. ఐఐఎస్
సీ బెంగళూరు, జేఎన్‌యూ, జామియామిలియా మొదటి మూడు స్థానాలు దక్కించుకున్నాయి.
అలాగే ఐఐటీ
మద్రాస్,
ఐఐటీ దిల్లీ, ఐఐటీ బాంబే..
ఉత్తమ ఇంజనీరింగ్ కళాశాలలని విద్యాశాఖ పేర్కొంది. ఫార్మసీ విభాగానికి వస్తే..
జామియా హండార్డ్ మొదటి స్థానంలో నిలిచింది. హైదరాబాద్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్
ఆఫ్ ఫార్మాసూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ రెండో స్థానం పొందగా.. చండీగఢ్ లోని
పంజాబ్ యూనివర్సిటీ మూడో స్థానంలో ఉంది.
NIRF-2022 ర్యాకింగ్స్ ను మొత్తం 11 విభాగాల్లో విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయం, మేనేజ్ మెంట్, కళాశాలలు, ఫార్మసీ, మెడికల్, ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, లా, రిసెర్చ్ ఇనిస్టిట్యూట్, ఏఆర్ఐ ఐఏ(అటల్ ర్యాకింగ్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ ఆన్ ఇన్నోవేషన్ అచీవ్ మెంట్స్).. ఈ విభాగాలుగా ఉన్నాయి. ఈ విద్యాసంస్థల్లోని విద్యాబోధన, కల్పిస్తున్న సౌకర్యాల ఆధారంగా 2016 నుంచి ఈ ర్యాంకులను ప్రకటిస్తున్నారు.
CLICK FOR ENGG
CATEGORY RANKINGS
The top 10 institutions under OVERALL category in the newly-released #IndiaRankings2022, National Institute Ranking Framework.
— Ministry of Education (@EduMinOfIndia) July 15, 2022
For detailed info, visit #NIRF portal: https://t.co/v0Oh5Zm0gG pic.twitter.com/sIjHanTArc
0 Komentar