India's First Monkeypox Case Reported in
Kerala
భారతదేశంలోకి
మంకీపాక్స్ – కేరళలో తొలి కేసు నమోదు
వివిధ
దేశాలను కలవర పెడుతోన్న మంకీపాక్స్ (Monkeypox).. భారత్ కూ విస్తరించింది. తొలికేసు కేరళలో నమోదయ్యింది. ఈ విషయాన్ని కేరళ (Kerala) ఆరోగ్యశాఖ అధికారికంగా ధ్రువీకరించింది. తొలుత అనుమానిత
కేసుగా గుర్తించిన అధికారులు, వైద్యపరీక్షల అనంతరం
మంకీపాక్స్ గా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), భారత వైద్య పరిశోధనా మండలి (ICMR) మార్గదర్శకాల మేరకు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.
ఇటీవల యూఏఈ (UAE) నుంచి తిరిగొచ్చిన ఓ వ్యక్తి మంకీపాక్స్ తరహా లక్షణాలతో
ఆసుపత్రిలో చేరినట్లు కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ (Veena George) వెల్లడించారు. వైరస్ నిర్ధారణ పరీక్షల నిమిత్తం అతడి నుంచి
నమూనాలను సేకరించి పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) కి పంపినట్లు తెలిపారు.
తాజాగా
వచ్చిన ఫలితాల్లో అది మంకీపాక్స్ గా నిర్ధారణ అయినట్లు ప్రకటించారు. సదరు వ్యక్తి
యూఏఈలో మంకీపాక్స్ సోకిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగారని.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం
నిలకడగానే ఉన్నట్లు వెల్లడించారు. మరోవైపు ఆయనతో సన్నిహితంగా ఉన్న ప్రైమరీ
కాంటాక్టులను గుర్తించామన్నారు. బాధితుడి తల్లి దండ్రులు, టాక్సీ, ఆటో డ్రైవర్లతోపాటు
మరో 11 మంది తోటి ప్రయాణికులను ప్రైమరీ కాంటాక్టులుగా గుర్తించామని
ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు.
ఇదిలా ఉంటే, గత కొంతకాలంగా వేగంగా విస్తరిస్తోన్న మంకీపాక్స్ ఇప్పటికే 59 దేశాలకు పాకింది. 6వేల మందిలో
నిర్ధారణ కాగా.. ముగ్గురు మృత్యువాత పడ్డారు. మంకీపాక్స్ కేసులు ఎక్కువగా యూరప్, ఆఫ్రికాలోనే నమోదవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ
వెల్లడించింది.
0 Komentar