Man Gets Hired by Google After 39
Attempts. His Story Is Now Viral
తనకు ఇష్టమైన
గూగుల్ లో ఉద్యోగం కోసం 39 సార్లు ప్రయత్నం సఫలం – వివరాలు ఇవే
కలలుగన్న
సంస్థలో కొలువు పొందేందుకు ఓ వ్యక్తి విశ్వప్రయత్నాలు చేశాడు. ఒకటి కాదు.. రెండు
కాదు.. ఏకంగా 39 సార్లు ప్రయత్నించి ఎట్టకేలకు అనుకున్నది సాధించాడు. ఇంతకీ విషయం
ఏంటంటే..
యూఎస్ లోని
శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన టైలర్ కోహెన్ కు ప్రముఖ దిగ్గజ సంస్థ గూగుల్ లో
ఉద్యోగం సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అది ఆయన కల. ఇతర ఉద్యోగాలు
చేస్తూనే.. గూగుల్ కు దరఖాస్తు చేసుకోవడం మాత్రం మానలేదు. అందుకోసం ఏకంగా 39
సార్లు ప్రయత్నించారు. 'పట్టుదలకు, పిచ్చితనానికి మధ్య సన్నని గీత ఉంటుంది. ఈ రెండింటిలో
నాకుంది ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. 39 తిరస్కరణలు. ఎట్టకేలకు
ఆమోదం'
అంటూ ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా గూగుల్ తో జరిపిన ఈ మెయిల్
సంభాషణలను షేర్ చేశారు.
తిరస్కరణలకు
వెరవకుండా కృషి చేయడంతో జులై 19న ఆయన కల నెరవేరింది. కలల కొలువు దక్కింది. ఆ విషయం
వెల్లడిస్తూ ఆయన చేసిన పోస్టు వైరల్ గా మారింది. ఆయన మొదట ఆగస్టు 25, 2019లో గూగుల్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు.
అప్పటినుంచి మొదలైన తిరస్కరణల పర్వం జులై 19, 2022కు పుల్
స్టాప్ పడింది. ఈ పోస్టు చూసిన నెటిజన్లు కొహెనకు అభినందనలు తెలియజేశారు.
మరికొందరు తమకు ఎదురైన తిరస్కరణల సంఖ్యను పంచుకున్నారు
0 Komentar