New Tyre Designs for Cars, Buses, Trucks
from October 1 - Govt Issues Notification
అక్టోబర్ 1 నుంచి కొత్త టైర్ డిజైన్లు - ప్రభుత్వం
నోటిఫికేషన్ జారీ
అక్టోబర్ 1 నుంచి ప్రయాణికుల కార్లు, ట్రక్కులు, బస్సులకు నిర్దిష్ట ప్రమాణాలతో కూడిన
కొత్త రకం డిజైన్ల టైర్లు వాడాలని కేంద్ర రహదారి, రవాణా శాఖ నిర్దేశించింది. ఈ మేరకు శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇకపై కొత్త టైర్లు రోలింగ్ రెసిస్టెన్స్, వెట్ గ్రిప్, రోలింగ్ సౌండ్ ఎమిషన్ విషయాల్లో 'ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ 142.2019'లో నిర్దేశించినట్లుగా ఉండాలని కేంద్రం పేర్కొంది.
ప్యాసింజర్
కార్లు,
లైట్ ట్రక్కులు, ట్రక్కులు
బస్సులకూ ఈ నిబంధనలు వరిస్తాయని తెలిపింది. వాహనాలు రహదారుల మీద పరుగులు
తీసేటప్పుడు రోడ్డును పట్టుకొని ఉండటం (రోలింగ్ రెసిస్టెన్స్), తడిరోడ్లపై జారిపోకుండా ఉండటం (వెట్ గ్రిప్), శబ్దం వెలువరించడం (సౌండ్ ఎమిషన్) కొత్త నిబంధనల ప్రకారం
ఉండాలని కేంద్రం పేర్కొంది.
ఈ నిబంధనల
అమలుతో భారత్ కూడా 'యునైటెడ్ నేషన్స్ ఎకనమిక్ కమిషన్
ఫర్ యూరప్' స్థాయి ప్రమాణాలను ఆచరణలోకి
తెచ్చినట్లవుతుందని తెలిపింది. "టైర్ల రోలింగ్ రెసిస్టెన్స్ లో మార్పులు
చేయడంవల్ల ఇంధన వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. వెట్ గ్రి లో మార్పులవల్ల టైర్ల
బ్రేకింగ్ సామర్థ్యం పెరిగి రోడ్లమీద తడి ఉన్నప్పుడు ప్రమాదాలు తగ్గుతాయి"
అని పేర్కొంది. ఇప్పటికే వాడుకలో ఉన్న పాత డిజైన్ టైర్లు 2023 ఏప్రిల్ 1 నుంచి రోలింగ్
రెసిస్టెన్స్, వెట్ గ్రిప్ ప్రమాణాలను, అదే ఏడాది జూన్ 1 నుంచి సౌండ్
ఎమిషన్ ప్రమాణాలను పాటించాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది.
MoRTH has issued a notification mandating requirements of rolling resistance, wet grip and rolling sound emissions for tyres of passenger cars, trucks and buses. This aims at improving fuel efficiency, driving safety and reduction of noise caused due to rolling sound emission. pic.twitter.com/36gIHRjvek
— MORTHINDIA (@MORTHIndia) July 1, 2022
MoRTH notification regarding requirements of rolling resistance, wet grip and rolling sound emissions for tyres.
— MORTHINDIA (@MORTHIndia) July 1, 2022
Please click the link to see the Gazette notification.https://t.co/xwa7J3BbOi
0 Komentar