OAMDC: Degree
Online Admissions 2022-23 – All the Details Here
ఏపీ: డిగ్రీ 2022-23 ఆన్‌లైన్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం – పూర్తి వివరాలు
ఇవే
డిగ్రీ
ఆన్లైన్ ప్రవేశాలను ఈ నెల 23 నుంచి
ప్రారంభించనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి తెలిపారు. 22న ప్రకటన విడుదల చేస్తామని 23 నుంచి 31 వరకు దరఖాస్తులకు సమయం ఇచ్చామని
వెల్లడించారు. ఆన్లైన్లోనే ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని తరగతులు ఆగస్టు 24
నుంచి మొదలవుతాయని వెల్లడించారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు
డిగ్రీ కాలేజీల్లో బీఏ, బీకాం, బీఎస్సీ
తదితర అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఆన్లైన్ ప్రవేశాల ప్రక్రియ ఈనెల 23 నుంచి ప్రారంభమవుతుందని ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్ బి. సుధీర్
ప్రేమ్ కుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్ట్స్, సైన్స్, సోషల్ సైన్సెస్, కామర్స్, మేనేజ్మెంట్ తదితర కోర్సుల్లో
ప్రవేశాలను నిర్వహించనున్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు అన్
ఎయిడెడ్, కాలేజీలతోపాటు అటానమస్ కాలేజీల్లోని హానర్స్ డిగ్రీ
కోర్సులు, ఇతర డిగ్రీ కోర్సుల్లోనూ ప్రవేశాలు కల్పించనున్నారు.
ఆన్లైన్ అడ్మిషన్స్ మాడ్యూల్ ఫర్ డిగ్రీ కాలేజెస్ (ఓఏఎండీసీ) ద్వారా ప్రవేశాలను
చేపట్టనున్నారు. ఇక దివ్యాంగులు, ఎస్ సీసీ, స్పోర్ట్స్, గేమ్స్ తదితర విభాగాలకు సంబందించిన స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్‌ను విజయవాడ
ఎస్ఆర్ఆర్ కాలేజీ, విశాఖపట్నం డా. వీఎస్ కృష్ణా కాలేజీ, తిరుపతి ఎస్వీ వర్సిటీలో నిర్వహిస్తారు.
షెడ్యూల్ ఇదే:
నోటిఫికేషన్ విడుదల తేదీ: జూలై 22
రిజిస్ట్రేషన్ల ప్రారంభ తేదీ: జూలై 23 నుంచి 31వరకు
సర్టిఫికెట్ల పరిశీలన ఆన్లైన్లో, హెచ్ఎల్‌సీల్లో:
ఆగస్టు 1 నుంచి 5 వరకు
స్పెషల్ కేటగిరీ పరిశీలన: ఆగస్టు 3, 4 తేదీల్లో
వెబ్ ఆప్షన్లు: ఆగస్టు 8 నుంచి 12 వరకు
వెబ్ ఆప్పన్ల సవరణ: ఆగస్టు 13 నుంచి 15 వరకు
సీట్ల కేటాయింపు: ఆగస్టు 20 నుంచి
కాలేజీలకు రిపోర్టింగ్: ఆగస్టు 22 నుంచి 24 వరకు
తరగతుల ప్రారంభం: ఆగస్టు 25 నుండి
0 Komentar