President's Powers:
Ordinances, Pardons, Proclamation of Emergency And A Lot More
రాష్ట్రపతి
అధికారాలు: ఆర్డినెన్స్‌లు, క్షమాభిక్ష, ఎమర్జెన్సీ మరియు మరెన్నో – తెలుసుకోవలసిన విషయాలు ఇవే
భారత దేశ 15వ
రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము (Droupadi Murmu) బాధ్యతలు చేపట్టారు. అంతేకాకుండా దేశ అత్యున్నత పీఠం పై తొలి ఆదివాసీ మహిళగానూ
రికార్డు సృష్టించారు. ఈ నేపథ్యంలో దేశ ప్రథమ పౌరురాలిగా రాష్ట్రపతి ద్రౌపదీ
ముర్ముకి ఎలాంటి అధికారాలు ఉంటాయో తెలుసుకుందాం.
ఆర్డినెన్స్లు (Ordinances) జారీ చేయడం, ఖైదీలకు క్షమాభిక్ష ప్రకటించడం (Pardons), రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ (Emergency) విధించడం, ప్రధానమంత్రి నేతృత్వంలోని కేంద్ర
కేబినెట్ సలహా మేరకు దేశంలోనూ ఎమర్జెన్సీ విధించే అధికారాలు రాష్ట్రపతికి ఉన్న
అధికారాల్లో కీలకమైనవనే చెప్పవచ్చు.
*
రాజ్యాంగాధినేత ఐన రాష్ట్రపతి రాజ్యాంగానికి రక్షకుడిలా ఉంటారు. అంతేకాకుండా
పార్లమెంట్ సమావేశాలను ప్రారంభించడంతోపాటు త్రివిధ దళాలకు సుప్రీం కమాండర్ గానూ
ద్రౌపదీ ముర్ము వ్యవహరిస్తారు
* రాష్ట్రపతి
పదవీకాలం ఐదేళ్లు. ఈ పదవిలో ద్రౌపదీ ముర్ము జులై 24, 2027 వరకు కొనసాగుతారు
* పదవీకాలం
ముగిసిన తర్వాత ద్రౌపదీ ముర్ము తిరిగి రాష్ట్రపతి బరిలో మరోసారి నిలబడవచ్చు. కానీ, దేశ మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్
మాత్రమే రెండుసార్లు ఎన్నికయ్యారు
*
రాష్ట్రపతిని తొలగించడం అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 61 పద్ధతి ప్రకారం
జరుగుతుంది
* రాష్ట్రపతి
రాజీనామా చేయాలనుకుంటే ఉపరాష్ట్రపతికి రాజీనామా లేఖను అందజేయాల్సి ఉంటుంది
*
రాజ్యాంగాన్ని అనుసరించి కేంద్ర కేబినెట్ నిర్ణయంతో లోక్ సభను ఎప్పుడైనా రద్దు
చేసే అధికారం రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ముకి ఉంటుంది
* పార్లమెంట్
ఉభయ సభలు సమావేశమైనప్పుడు తప్ప మిగతా సమయాల్లో ఎప్పుడైనా రాష్ట్రపతి ఆర్డినెన్స్
లు (Ordinances)జారీ చేయవచ్చు
* ఆర్థిక, మనీ బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిఫార్సు చేయవచ్చు.
క్షమాభిక్ష పెట్టడం, మరణశిక్ష
నిలిపివేయడం లేదా తాత్కాలికంగా వాయిదా వేయడం, జైలుశిక్ష
తగ్గించడం వంటి ఆదేశాలు జారీ చేయవచ్చు.
* ఏదైనా
రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థ విఫలమైన సందర్భాల్లో పాలనా బాధ్యతలను (President's Rule) రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము చేపట్టవచ్చు.
* దేశభద్రతకు
ముప్పు వాటిల్లడం లేదా ఇతర దేశాలు దండయాత్రకు వచ్చే సందర్భాల్లో లేదా దేశంలో
అత్యవసర పరిస్థితులు నెలకొన్నాయని భావించినప్పుడు ఎమర్జెన్సీ (Emergency) విధిస్తున్నట్లు ప్రకటించవచ్చు
* ఎలక్టోరల్
కాలేజీ ద్వారా రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము ఎన్నికైన విషయం తెలిసిందే.
0 Komentar