P.V. Sindhu
clinches Singapore Open-2022 Title
సింగపూర్ ఓపెన్ 2022 ఫైనల్లో పీవీ సింధు విజయం – తొలి సూపర్ 500 టైటిల్
తెలుగు తేజం
పీవీ సింధు తన కెరీర్ లోనే తొలి సూపర్ 500 టైటిల్ ను నెగ్గింది. సింగపూర్ ఓపెన్ ఫైనల్ లో చైనా క్రీడాకారిణి వాంగ్ జి
యిని మట్టికరిపించింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన సింధు 21-9, 11-21,
21-16 తేడాతో వాంగ్ పై విజయం సాధించింది. దీంతో
తొలిసారి సింగపూర్ ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుత సీజన్లో సింధుకిది
మూడో టైటిల్. ఇదే ఏడాది సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్, స్విస్ ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ సూపర్ 300 టైటిళ్లను గెలుచుకుంది.
అద్భుత ఫామ్
లో ఉన్న ఏడో ర్యాంకర్ పీవీ సింధును 11వ ర్యాంకర్
బాగానే ప్రతిఘటించింది. అయితే తొలి గేమ్ లో సింధు 21-9 తేడాతో అలవోకగా గెలిచింది. ఈ క్రమంలో రెండో గేమ్ లో వాంగ్ సూపర్ గా
పుంజుకుంది. దీంతో సింధును వాంగ్ 11-21తో ఓడించింది. కీలకమైన మూడో గేమ్ లో ఇద్దరు నువ్వానేనా అన్నట్లు ఆడారు. తొలి
హాఫ్ ముగిసేసరికి 11-6తో సింధు ముందంజ
వేసింది. అయితే బ్రేక్ తర్వాత వరుసగా వాంగ్ పాయింట్లను సాధించడంతో సింధు 17-14 కి వెళ్లింది. కానీ ఆఖర్లో వాంగు సింధు ఏమాత్రం అవకాశం
ఇవ్వలేదు. వరుసగా పాయింట్లను సాధించి 21-15 తేడాతో మూడో గేమ్ తోపాటు టైటిల్ ను సొంతం చేసుకుంది.
Opening finals match as Pusarla V. Sindhu 🇮🇳 and Wang Zhi Yi 🇨🇳 clash for the title.#BWFWorldTour #SingaporeOpen2022 pic.twitter.com/iduU7MwBku
— BWF (@bwfmedia) July 17, 2022
0 Komentar