RIMC Admissions (TSPSC):
ఆర్ఐఎంసీ లో 8 వ తరగతి ప్రవేశాలకు ప్రకటన వివరాలు ఇవే
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన దెహ్రాడూన్ లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ(ఆరవ్ ఎంసీ)లో జులై 2023 టర్మ్ ఎనిమిదో తరగతి ప్రవేశాలకు తెలంగాణకు చెందిన బాలురు, బాలికల నుంచి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) దరఖాస్తులు కోరుతోంది.
ఆర్ఐఎంసీలో
ఎనిమిదో తరగతి ప్రవేశాలు
అర్హత: ఏడో
తరగతి చదువుతున్న లేదా ఎడో తరగతి ఉత్తీర్ణులైనవిద్యార్థులు అర్హులు.
వయసు: 01.07.2022 నాటికి పదకొండున్నర ఏళ్లకు తగ్గకుండా పదమూడేళ్లకు
మించకుండా ఉండాలి. 02.07.2010-01.01.2012 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక
విధానం: రాత పరీక్ష, వైవా వాయిస్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
పరీక్షా
విధానం: రాత పరీక్షలో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. అవి మ్యాథమేటిక్స్, జనరల్ నాలెడ్జ్, ఇంగ్లిష్
నుంచి ప్రశ్నలు ఉంటాయి. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు వైవా వాయిస్
నిర్వహిస్తారు. దీనిలో కనీస ఉత్తీర్ణత మార్కులు 50% ఉండాలి. ఈ రెండింటిలో అర్హత
సాధించిన అభ్యర్థులకు చివరిగా మెడికల్ టెస్ట్ ఉంటుంది.
దరఖాస్తు
విధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు
ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ/ ఎస్టీ
అభ్యర్థులు రూ.555 చెల్లించాలి.
దరఖాస్తులను
పంపడానికి చిరునామా: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ), నాంపల్లి, హైదరాబాద్, తెలంగాణ-500001.
ముఖ్య మైన
తేదీలు:
దరఖాస్తుకు
చివరి తేది: 15.10.2022
పరీక్ష తేది: 03.12.2022.
0 Komentar