Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

RRC Recruitment 2022: Apply for 1659 Apprentice Posts - Details Here

 

RRC Recruitment 2022: Apply for 1659 Apprentice Posts - Details Here

నార్త్‌ సెంట్రల్‌ రైల్వే రిక్రూట్‌మెంట్‌ 2022: 1659 అప్రెంటీస్ ఖాళీల భర్తీకి సంభందించిన పూర్తి వివరాలు ఇవే

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకుచెందిన రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌.. నార్త్‌ సెంట్రల్‌ రైల్వే (North Central Railway) భారీ జాబ్ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 1659 అప్రెంటీస్ (Apprentice Vacancies) ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవచ్చు. ఆగస్టు 1 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు క్రింది వెబ్‌సైట్‌ చూడొచ్చు.

మొత్తం ఖాళీలు: 1659

పోస్టులు: అప్రెంటీస్ ఖాళీలు

విభాగాలు: వెల్డర్‌, అర్మచ్యుర్‌ విండర్‌, మెషినిస్ట్‌, కార్పెంటర్‌, ఎలక్ట్రీషియన్‌, పెయింటర్‌, మెకానిక్‌, ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యునికేషన్‌ టెక్నాలజీ సిస్టమ్‌ మెయింటెనెన్స్‌, వైర్‌మెన్‌, ప్లంబర్‌, హెల్త్‌ శానిటరీ ఇన్స్‌పెక్టర్‌ తదితర ట్రేడుల్లో ఖాళీలున్నాయి.

వయోపరిమితి: ఆగస్టు 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

పేస్కేల్‌: నెలకు రూ.18,000 నుంచి రూ.56,900 వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: మెట్రిక్యులేషన్‌/పదో తరగతి లేదా తత్సమాన కోర్సులో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ సర్టిఫికేట్‌ కూడా ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము: జనరల్ అభ్యర్ధులకు: రూ.100, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులు ప్రారంభ తేది: జులై 2, 2022

దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 1, 2022

NOTIFICATION

APPLY HERE

JOB DETAILS PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags