Rupee Value at Lifetime Low - Rupee Value Near to 80 Against Dollar
జీవిత కాల
కనిష్ఠానికి రూపాయి విలువ - డాలరుతో రూపాయి విలువ 80 దగ్గరగా
రూపాయికి కష్టాలు తప్పడం లేదు. సోమవారం మరో రికార్డు
కనిష్టానికి జారుకుంది. గ్లోబల్ మాంద్యం, ముడిచమురు
సరఫరా,
మార్కెట్లలో మిశ్రమ సెంటిమెంట్‌పై పెట్టుబడిదారుల ఆందోళన
నేపథ్యంలో డాలరు మారకంలో రూపాయి 79.40 వద్ద ఆల్ లైం
కనిష్టాన్ని నమోదు చేసింది. శుక్రవారం79.26 వద్ద ముగిసింది. గత రెండు వారాలుగా అత్యంత కనిష్ట స్థాయిలకు చేరుతున్న రూపాయి
ప్రస్తుతం 80 మార్క్‌కు చేరువలో ఉండటం ఆందోళన రేపుతోంది.
దేశీయ,అంతర్జాతీయ ద్రవ్యోల్బణ డేటాపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టారని
విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచ ఆర్థికవృద్ధి ఆందోళన, చమురు మార్కెట్లో అస్థిరత డాలర్‌కు బలాన్నిస్తోందని
పేర్కొన్నారు. మరోవైపు వరుసగా మూడు సెషన్ల
లాభాలకు స్వస్తి చెప్పిన స్టాక్‌మార్కెట్ నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్
325 పాయింట్లు క్షీణించి 54156 వద్ద, నిఫ్టీ 87 పాయింట్ల నష్టంతో 16137 వద్ద కొనసాగుతోంది.
0 Komentar