SSC Delhi Police Head Constable Recruitment
2022: Apply for 857 Posts – Details Here
దిల్లీ
పోలీసు విభాగంలో 857 హెడ్ కానిస్టేబుల్
పోస్టులు - జీతభత్యాలు: పే లెవల్-4 (రూ.25500-81100)
దేశ రాజధాని
దిల్లీలోని దిల్లీ పోలీసు విభాగంలో హెడ్ కానిస్టేబుల్ (అసిస్టెంట్ వైర్ లెస్
ఆపరేటర్/ టెలీ-ప్రింటర్ ఆపరేటర్) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆన్లైన్
దరఖాస్తులు కోరుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని అర్హతలున్న అభ్యర్థులు దరఖాస్తు
చేసుకోవచ్చు.
మొత్తం
పోస్టుల సంఖ్య: 857
1. హెడ్ కానిస్టేబుల్ (ఏడబ్ల్యూవో/ టీపీవో) - పురుషులు: 573 (జనరల్-213, ఈడబ్ల్యూఎస్- 58, ఓబీసీ- 128, ఎస్సీ- 106, ఎస్టీ- 68)
2. హెడ్ కానిస్టేబుల్ (ఏడబ్ల్యూవో/ టీపీవో) - మహిళలు: 284(జనరల్107, ఈడబ్ల్యూఎస్- 29, ఓబీసీ- 63, ఎస్సీ- 52, ఎస్టీ- 33)
అర్హత: 10+2 (సీనియర్ సెకండరీ) సైన్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లో లేదా మెకానిక్-కమ్ ఆపరేటర్ ఎలక్ట్రానిక్
కమ్యూనికేషన్ సిస్టమ్ ట్రేడ్ లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉత్తీర్ణత. కంప్యూటర్
ఆపరేషన్స్ లో ప్రావీణ్యం
వయోపరిమితి: 01-07-2022 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతభత్యాలు:
పే లెవల్-4 (రూ.25500-81100)
ఎంపిక
విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, శారీరక దారుఢ్యం, కొలత పరీక్షలు, ట్రేడ్
టెస్ట్,
ఇంగ్లిష్ వర్డ్ ప్రాసెసింగ్ టెస్ట్, బేసిక్ కంప్యూటర్ ఫంక్షన్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
కంప్యూటర్
బేస్డ్ ఎగ్జామినేషన్: ఆబ్జెక్టివ్ విధానంలో 100 మార్కులకు గాను 100 ప్రశ్నలుంటాయి.
జనరల్ అవేర్‌నెస్, జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్, రీజనింగ్, కంప్యూటర్ ఫండమెంటల్స్, ఎంఎస్
ఎక్సెల్,
ఎంఎస్ వర్డ్, కమ్యూనికేషన్, ఇంటర్నెట్, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, వెబ్ బ్రౌజర్లు తదితర అంశాల్లో ప్రశ్నలుంటాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని పరీక్షా కేంద్రాలు: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం , హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
దరఖాస్తు
రుసుము: రూ.100 (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది)
దరఖాస్తు
విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ముఖ్యమైన
తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: 08-07-2022
దరఖాస్తు స్వీకరణకు చివరి తేది: 29-07-2022.
ఆన్లైన్ ఫీజు
చెల్లింపు చివరి తేది: 30-07-2022.
కంప్యూటర్
ఆధారిత పరీక్ష తేది: 2022 అక్టోబర్ లో ఉంటాయి.
ఎలా దరఖాస్తు
చేసుకోవాలో కింది నోటిఫికేషన్‌లోని Para 11 ని చూడండి.
0 Komentar