Truecaller Launches 'Open Doors' App: How
Does It Work?
ట్రూకాలర్ నుండి
‘ఓపెన్ డోర్స్’ పేరుతో కొత్త యాప్ - వివరాలు
ఇవే
కొంత మంది వ్యక్తులు ఒకచోట చేరి ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ అంశాల గురించి చర్చించుకుంటూ, తమ అభిప్రాయాలను తెలియచేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ ట్రెండ్ మారింది. భౌతికంగా ఒక చోట కూర్చునే చర్చావేదికలు పోయి ఆన్లైన్ చర్చావేదికలు ప్రారంభమయ్యాయి.
అలా వచ్చిన తొలి యాప్ క్లబ్ హౌస్ (Clubhouse). తర్వాత ట్విటర్ స్పేసెస్ (Twitter Spaces)ను పరిచయం చేయగా ఫేస్ బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్
(Instagram)లు కూడా ఇదే తరహా ఫీచర్ తీసుకొస్తున్నట్లు ప్రకటించాయి. ఈ
జాబితాలో ట్రూకాలర్ (Truecaller) కూడా చేరిపోయింది.
కొత్తగా ఓపెన్ డోర్స్ (Open Doors) పేరుతో వాయిస్
ఆధారిత యాప్ ను పరిచయం చేసింది. ఇందులో యూజర్లు తమ స్నేహితులు, పరిచయస్తులతో వాయిస్ సంభాషణలు జరపవచ్చు.
ఓపెన్ డోర్స్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్న తర్వాత ఫోన్ లోని కాంటాక్ట్స్ ను యాక్సెస్ చేసేందుకు అనుమతించాల్సి ఉంటుంది. దాంతో మీ కాంటాక్ట్స్ జాబితాలోని వారు ఓపెన్ డోర్స్ ద్వారా చర్చలో పాల్గొంటుంటే మీ ఫోను నోటిఫికేషన్ వస్తుంది. ఒకవేళ మీరు కూడా చర్చలో భాగస్వాములు కావాలనుకుంటే నోటిఫికేషన్ పై క్లిక్ చేసి సంభాషణలు జరపడంతోపాటు, నచ్చిన అంశాలపై చర్చించుకోవచ్చు.
గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి యూజర్లు ఈ యాప్ ను డౌన్ లోడ్
చేసుకోవచ్చు. ఆంగ్లం, హిందీ, స్పానిష్, లాటిన్, ఫ్రెంచ్ భాషల్లో అందుబాటులో ఉంది. భవిష్యత్తులో మరిన్ని
భాషలు అందుబాటులోకి రానున్నాయి. ఈ యాప్ ద్వారా జరిపే సంభాషణలు ఎక్కడా స్టోర్ కావని
ట్రూకాలర్ తెలిపింది. సంభాషణలు జరిపే సమయంలో యూజర్ల ఫోన్ నంబర్లు ఇతరులు చూడలేరు.
దీనివల్ల యూజర్ల వ్యక్తిగత గోప్యతకు ఎలాంటి భంగం వాటిల్లదని తెలిపింది.
Open to talk? Get ready to experience our new app, Open Doors!
— Truecaller (@Truecaller) July 13, 2022
Get talking about anything and everything with your circle of friends, and even their friends around the world. #TalkFreely #OpenDoors
Get it now: https://t.co/xaPHcM9JqN pic.twitter.com/28ehUptPRl
0 Komentar