TS: Another 3 Days
Holidays for Educational Institutions Due to Heavy Rain
టీఎస్: భారీ
వర్షాల నేపథ్యంలో తెలంగాణలో విద్యాసంస్థలకు మరో మూడు రోజులు సెలవులు
====================
UPDATE 13-07-2022
భారీ వర్షాల
నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం
ప్రకటించింది. గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు
కురుస్తుండటం... పలుచోట్ల వరద పరిస్థితులు ఉండటంతో మరో మూడు రోజులు సెలవులు
పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు
వాతావరణశాఖ, విద్యాశాఖ అధికారులతో చర్చలు జరిపి
అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. గతవారం రోజులుగా వర్షాలు కురుస్తున్నందున
రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు మూడురోజుల పాటు (సోమ, మంగళ, బుధవారం) సెలవులు
ఇస్తున్నట్లు ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది.
ప్రభుత్వం
తొలుత ప్రకటించిన విధంగా బుధవారంతో సెలవుల గడువు ముగిసిపోనుండటంతో తాజాగా మరో మూడు
రోజులు పొడిగించారు. 18న (సోమవారం)
పాఠశాలలు తిరిగి ప్రారంభంకానున్నాయి.
====================
భారీ వర్షాల
నేపథ్యంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్ని విద్యా సంస్థలకు
రేపట్నుంచి మూడు రోజుల పాటు (సోమ, మంగళ, బుధవారం) సెలవులు ప్రకటించారు.
గత రెండు
రోజుల్లో హైదరాబాద్ వ్యాప్తంగా సగటున 8 సెం.మీ.
వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇవాళ కూడా చిరుజల్లులు
పడుతూనే ఉన్నాయి. మరో రెండు రోజుల పాటు భారీ వర్ష సూచన ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ
వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా జీహెచ్ఎంసీ పరిధిలోని మాన్ సూన్
బృందాలను అధికారులు అప్రమత్తం చేశారు.
అత్యవసరమైతే
తప్ప బయటకు రావొద్దు..
రాష్ట్రంలో
మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయని.. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు
కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్
యాదవ్ సూచించారు. ఈ మేరకు హైదరాబాద్ నగర ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు.
అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని చెప్పారు. అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి
ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా చూడాలని పేర్కొన్నారు.
జీహెచ్ఎంసీ
అధికారుల సహాయం కొరకు 040-21111111 టోల్ ఫ్రీ నంబర్ ను
సంప్రదించాలన్నారు. కార్పొరేటర్లు తమ తమ డివిజన్లలో పర్యటిస్తూ పరిస్థితులను
పరిశీలించాలని.. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని తలసాని
ఆదేశించారు.
0 Komentar