Open Book
Exam: TS పాలిటెక్నిక్
కోర్సుల్లో ఓపెన్ బుక్ విధానం - ఈ సారి గణితం పరీక్ష చూసి
రాయొచ్చు
తొలిసారిగా గత ఏడాది పాలిటెక్నిక్ డిప్లొమాలో చేరిన
విద్యార్థులకు ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఓపెన్ బుక్ ఎగ్జామ్ విధానాన్ని ఈసారి
మరింత విస్తరించనున్నారు. గత సంవత్సరం ఒకటి, రెండు
సెమిస్టర్లలో ఆంగ్లం పరీక్షకు పుస్తకాలు పక్కన పెట్టుకొని రాసుకునే ఓపెన్ బుక్
ఎగ్జామ్ విధానాన్ని అమలు చేశారు.
ఈసారి ఆ విద్యార్థులు రెండో ఏడాదిలోకి ప్రవేశించారు. వారికి
ఆంగ్లం సబ్జెక్టు ఉండదు. అయితే గణితం సబ్జెక్టులో ఈ విధానంలో పరీక్షలు జరుగుతాయి.
అందుకు తగ్గట్లు బోధనతోపాటు ప్రశ్నపత్రాల రూపకల్పన ఉంటుందని ఎస్ బీటెట్ కార్యదర్శి
సి.శ్రీనాథ్ తెలిపారు. పుస్తకం మొత్తం చదవటంతోపాటు సబ్జెక్టును ఆకళింపు
చేసుకుంటేనే ఈ విధానంలో పరీక్షలు బాగా రాయగలుగుతారని నిపుణులు చెబుతున్నారు.
===================
Article on
18-07-2021
Open Book
Exam: TS పాలిటెక్నిక్
కోర్సుల్లో ఓపెన్ బుక్ విధానం - ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు
===================
0 Komentar