TS: EAMCET & ECET-2022 Results Update
టీఎస్: ఎంసెట్, ఈసెట్ పరీక్షల ఫలితాల అప్డేట్ ఇదే
===================
UPDATE 11-08-2022
తెలంగాణలో
ఎంసెట్,
ఈసెట్ ఫలితాలు శుక్రవారం (Aug 12) విడుదల కానున్నాయి. ఉదయం 11.15 గంటలకు ఈసెట్, ఉదయం 11.45 గంటలకు ఎంసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా
రెడ్డి విడుదల చేయనున్నారు.
===================
UPDATE
19-07-2022
వాయిదా పడ్డ ఎంసెట్ (AM), ఈసెట్ పరీక్షల తాజా షెడ్యూల్ ఇదే
తెలంగాణలో భారీ వర్షాలు, వరదల కారణంగా
వాయిదా పడిన ఎంసెట్ అగ్రికల్చర్ ప్రవేశ పరీక్ష షెడ్యూల్ ను రాష్ట్ర ఉన్నత
విద్యామండలి ఖరారు చేసింది.
ఈ నెల 30, 31న ఎంసెట్ (అగ్రికల్చర్) పరీక్ష
నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి వెల్లడించారు.
అలాగే ఆగస్టు 1న ఈసెట్, ఆగస్టు 2 నుంచి 5 వరకు పీజీఈ సెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు
తెలిపారు.
సంబంధిత వెబ్ సైట్ల నుంచి అభ్యర్థులు తమ హాల్ టికెట్లను
డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. కాగా.. (జులై 13) జరగాల్సిన ఈ సెట్ పరీక్ష మరియు జులై 14, 15న జరగాల్సిన ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షలను భారీ వర్షాల నేపథ్యంలో ఉన్నత
విద్యామండలి వాయిదా వేసిన విషయం తెలిసిందే.
CLICK
HERE FOR REVISED EXAM DATES
===================
UPDATE 11-07-2022
> రాష్ట్రంలో
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రవేశ పరీక్షల
నిర్వహణపై కన్వీనర్లు, సంబంధిత అధికారులతో
ఛైర్మన్ సమీక్షించారు.
> బుధవారం
(జులై 13)
జరగాల్సిన ఈ సెట్ పరీక్ష వాయిదా వేయాలని ఉన్నత విద్యామండలి
నిర్ణయించింది.
> ఈనెల 14 నుంచి ఎంసెట్ యథాతథంగా కొనసాగుతుందని ఉన్నత విద్యామండలి
చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు.
ఈనెల 18వరకు ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడం.. పలు
ప్రాంతాల్లో వరద ఉద్ధృతి ఉన్నందున ఈ సెట్ వాయిదా వేయాలని నిర్ణయించారు. ఈ సెట్
మళ్లీ ఎప్పుడు నిర్ణయించాలనే విషయాన్ని తర్వాత ఖరారు చేస్తామని లింబాద్రి
పేర్కొన్నారు. ఈనెల 14, 15 తేదీల్లో ఎంసెట్
అగ్రికల్చర్, 18 నుంచి 20 వరకు జరిగే ఇంజినీరింగ్ ఎంసెట్ యథాతథంగా ఉంటుందని.. షెడ్యూలులో ఎలాంటి మార్పు
లేదని స్పష్టం చేశారు. వాయిదా వేస్తే ఆన్లైన్ పరీక్షలకు షెడ్యూలు ఖరారు చేయడం
కష్టమన్న ఉద్దేశంతో యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించారు.
===============
===============
TS ECET-2022 ALL THE DETAILS
===============
TS EAMCET-2022 ALL THE DETAILS
===============
0 Komentar