Volvo XC40 Recharge Electric
SUV Launched - Price, Features and Specification Details Here Recharge
భారత్ లో
తొలి విద్యుత్తు వోల్వో కారు ‘ఎక్స్ సీ40 రీఛార్జ్’ విడుదల – ధర మరియు ఫీచర్ల వివరాలు ఇవే
వోల్వో సంస్థ
భారత్ లో తొలి విద్యుత్తు కారు (Electric car) ను మంగళవారం
విడుదల చేసింది. ఎక్స్ సీ40 రీఛార్జ్ (Volvo XC40
Recharge) ఎలక్ట్రిక్ పేరిట తీసుకొస్తున్న ఈ SUV ధర రూ.55.90 లక్షలు (ఎక్స్
షోరూం). భారత్ లో అసెంబుల్ చేస్తున్న తొలి విలాసవంత విద్యుత్తు కారు ఇదే. రేపటి
నుంచి కంపెనీ వెబ్ సైట్లో బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. రూ.50 వేలు చెల్లించి కారును బుక్ చేసుకోవచ్చు. అక్టోబరు నుంచి
వినియోగదారులను అందజేస్తామని కంపెనీ తెలిపింది.
కాంపాక్ట్
మాడ్యులార్ ఆర్కిటెక్చర్ (CMA) ప్లాట్ ఫామ్ పై
వోల్వో ఎక్స్ సీ40 రీఛార్జ్ (Volvo XC40
Recharge)ను నిర్మించారు. సాధారణ ఎక్స్ సీ40ని కూడా ఇదే వేదికపై రూపొందించారు. ఇది రెండు విద్యుత్తు
మోటార్లతో నడుస్తుంది. 660 ఎన్ఎం టార్క్ వద్ద 402 బీహెచ్ పీ శక్తిని విడుదల చేస్తుంది. కేవలం 4.9 సెకన్లలో 0-100 కేఎంపీ హెచ్ వేగాన్ని అందుకుంటుంది. గరిష్ఠ వేగాన్ని 180 కేఎంపీ హెచ్ కు పరిమితం చేశారు.
ఎక్స్ సీ40 రీఛార్జ్ (Volvo XC40 Recharge)లో 18 కేడబ్ల్యూ హెచ్
లిథియం ఐయాన్ బ్యాటరీ ప్యాక్ ను అమర్చారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 418 కి.మీ వరకు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. 150 కేడబ్ల్యూ డీసీ ఫాస్ట్ ఛార్జర్ తో 40 నిమిషాల్లో 0-80 శాతం ఛార్జ్ అవుతుందని పేర్కొంది. అదే సాధారణ 11 కేడబ్ల్యూ ఏసీ ఛార్జర్ తో అయితే పూర్తి ఛార్జింగ్ కు ఎనిమిది గంటలు పడుతుందని
వెల్లడించింది.
ఫీచర్ల
విషయానికి వస్తే.. కొత్త ఆండ్రాయిడ్ ఆధారిత ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ ను అమర్చారు.
కనెక్టెడ్ కార్టెక్, పానరోమిక్ సన్ రూఫ్, అడాస్ వంటి ఆప్షన్లను అందులో పొందుపరిచారు. బెంగళూరు
సమీపంలోని హోసకోటె తయారీ కేంద్రంలో ఈ కారును అసెంబుల్ చేయనున్నారు. మినీ కూపర్
ఎస్ఈ,
కియా ఈ వీ6, ఆడీ ఈ-ట్రాన్, బీఎండబ్ల్యూ ఐ 4 వంటి
కార్లకు ఇది పోటీ ఇవ్వనుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Introducing the Pure Electric Volvo XC40 Recharge, the first of a whole new range of all-electric vehicles. Smart and versatile, designed For Every You.
— Volvo Car India (@volvocarsin) July 26, 2022
To know more: https://t.co/DZ6qw4aXre#XC40Recharge #FutureIsElectric pic.twitter.com/VKwUyo6RMw
All-Electric Volvo XC40 Recharge launched at ₹55.9 Lakh (ex-showroom)
— Times Drive (@TNTimesDrive) July 26, 2022
- Locally assembled
- 78.4 kWh battery
- 418 km range (WLTP)
- Dual-motor setup with 408 hp and 660 Nm
- 100% leather-free
The car will only be sold online directly Volvo. Deliveries to start in October pic.twitter.com/iNyJKEVxP4
0 Komentar