World Athletics Championships 2022: Neeraj
Chopra Wins Silver to Create History
ప్రపంచ
అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ 2022: రజత పతకం
సాధించిన నీరజ్ చోప్రా.. రెండో భారత అథ్లెట్‌గా రికార్డు
ప్రపంచ
అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా రజతం
గెలుచుకున్నాడు. జావెలిన్ త్రోలో 88.13 మీటర్ల దూరం విసిరి రజతం దక్కించుకున్నాడు. అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా) 90.54 మీటర్లు విసిరి స్వర్ణం సాధించాడు.
తొలి
ప్రయత్నంలో విఫలమైన నీరజ్.. తన నాలుగో ప్రయత్నంలో 88.13 మీటర్ల దూరం విసిరి రెండో స్థానానికి చేరుకున్నాడు. ఐదో ప్రయత్నంలోనూ నీరజ్
ఫౌల్ చేశాడు. మరో భారత జావెలిన్ త్రోయర్ రోహిత్ యాదవ్ ఆకట్టుకోలేకపోయాడు. మూడు
రౌండ్ల తర్వాత పదో స్థానంలో నిలిచి నిష్క్రమించాడు.
గ్రెనేడియన్
జావెలిన్ త్రోయర్ అండర్సన్ పీటర్స్ 90.54 దూరం విసిరి గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నాడు. సిల్వర్ మెడల్ సాధించిన
నీరజ్ చోప్రా అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పతకం
నెగ్గిన రెండో భారత అథ్లెట్‌గా నీరజ్ చోప్రా రికార్డులకెక్కాడు. అంతకు ముందు 2003లో పారిస్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో
భారత లాంగ్ జంపర్ అంజూ బాబి జార్జ్
కాంస్య పతకం సాధించింది.
Silver medal position at 88.13m
— Indian Javelin (@IndianJavelin) July 24, 2022
Credit : Peacock network pic.twitter.com/mCXArPcxdD
0 Komentar