Wimbledon 2022 Men's
Final: Djokovic Beats Kyrgios for Seventh Wimbledon Title
వింబుల్డన్ 2022: మరో సారి టైటిల్ గెలిచిన జకోవిచ్ - 21 గ్రాండ్ స్లామ్ టైటిళ్ల తో రెండో స్థానంలో నొవాక్
తన
ఆధిపత్యాన్ని చాటుకుంటూ సెర్బియా టెన్నిస్ స్టార్, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జకోవిచ్ వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ
పురుషుల సింగిల్స్ లో విజేతగా నిలిచాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో కిర్గియోస్ పై 4-6, 6-3, 6-4,
7-6 తేడాతో గెలుపొందాడు. దీంతో వరుసగా నాలుగోసారి
వింబుల్డన్ టైటిల్ ను గెలుచుకున్నాడు.
ఇప్పటివరకు
మొత్తం 7
వింబుల్డన్ టైటిళ్లను తన ఖాతాలో వేసుకున్నాడు. జకోవిచ్
కెరీర్ లో మొత్తం 21 గ్రాండ్ స్లామ్
టైటిళ్లను గెలుచుకున్న ఆటగాడిగా రెండో స్థానంలో ఉన్నాడు. అగ్రస్థానంలో నాదల్ (22), మూడో స్థానం లో (20) ఫెదరర్ కొనసాగుతున్నారు.
అంతకుముందు 2011, 2014, 2015లలో కూడా ఈ సెర్బియా స్టార్ చాంపియన్ అయ్యాడు. కరోనా
కారణంగా 2020లో వింబుల్డన్ టోర్నీని నిర్వహించలేదు. విజేతగా నిలిచిన
జొకోవిచ్‌కు 20 లక్షల బ్రిటిష్ పౌండ్లు (రూ. 19 కోట్ల 7 లక్షలు), రన్నరప్ కిరియోస్‌కు 10 లక్షల 50 వేల పౌండ్లు (రూ. 10 కోట్లు)
ప్రైజ్‌మనీగా లభించాయి. ఓవరాల్‌గా జొకోవిచ్ కెరీర్‌లో ఇది 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్. 35 ఏళ్ల జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను తొమ్మిదిసార్లు, ఫ్రెంచ్ ఓపెన్‌ను రెండుసార్లు, యూఎస్ ఓపెన్‌ను మూడుసార్లు గెలిచాడు.
0 Komentar