Zimbabwe To Mint Gold Coins to Tackle
Rising Prices
పెరుగుతున్న
ధరలను అధిగమించేందుకు జింబాబ్వే బంగారు నాణేల ముద్రణ
ద్రవ్యోల్బణంతో
కొట్టుమిట్టాడుతున్న జింబాబ్వే ఓ సంచలన నిర్ణయం తీసుకొంది. ధరల పెరుగుదలను అదుపు
చేసేందుకు ఏకంగా బంగారు నాణేలను ముద్రించాలని నిర్ణయించింది. దీంతోపాటు వచ్చే
ఐదేళ్లలో అమెరికా డాలరు కరెన్సీగా వాడాలనే ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. దేశంలో
ద్రవ్యోల్బణం 190శాతాన్ని మించిపోవడంతో ఇటీవల అక్కడి
కేంద్ర బ్యాంక్ వడ్డీ రేట్లను రెండు రెట్లు పెంచింది. మరో వైపు జింబాబ్వే డాలర్
విలువ గణనీయంగా పతనమవుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం పలు నిర్ణయాలను
ప్రకటించింది.
జులై 25వ తేదీ నుంచి 22క్యారెట్ల
స్వచ్ఛతతో కూడిన ఒక ట్రాయ్ ఔన్స్ బరువున్న బంగారు నాణేలను అందుబాటులోకి
తీసుకురానుంది. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ జింబాబ్వే గవర్నర్ జాన్ పి
ముంగుడి ప్రకటించారు. ఒక ట్రాయ్ ఔన్స్ 31.10 గ్రాముల బరువు తూగుతుంది. ఈ కొలతను బంగారం, వెండి, ప్లాటినం వంటి విలువైన లోహాల కొలతకు
వినియోగిస్తారు.
"ఈ నాణేలను స్థానిక కరెన్సీ, అమెరికా డాలర్లు, ఇతర విదేశీ కరెన్సీలను వినియోగించి కొనుగోలు చేయవచ్చు.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర, తయారీ ఖర్చు
కలుపుకొని ఉంటుంది” అని జాన్ పీ మాంగుడ్య వెల్లడించారు. దీనిలో ప్రతి కాయిన్ కు
సీరియల్ నెంబర్ ఉంటుంది. దీనిని తేలిగ్గా నగదులోకి మార్చుకొనే అవకాశం లభిస్తుంది.
దీనిని 'మోసి ఓ తున్యా గోల్డ్ కాయిన్'గా పిలుస్తారు. దేశంలో నగదు సమస్యను తీర్చేందుకు ప్రభుత్వం తీసుకొంటున్న
చర్యలో భాగంగా ఈ నిర్ణయం తీసుకొన్నారు.
0 Komentar