Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Anand Mahindra Shares Rakesh Jhunjhunwala's "Most Valuable Advice"

 

Anand Mahindra Shares Rakesh Jhunjhunwala's "Most Valuable Advice"

రాకేష్ జున్‌జున్‌వాలా "అత్యంత విలువైన సలహా"ని పంచుకున్న ఆనంద్ మహీంద్రా జీవితం లో ఉపయోగపడే పెట్టుబడి సూచన ఇదే

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra).. ఈ ఆదివారం మరో విలువైన సలహాతో ముందుకొచ్చారు. ఇటీవల గుండెపోటుతో మరణించిన బిలియనీర్ రాకేశ్ ఝున్ ఝున్ వాలా (Rakesh Jhunjhunwala) చెప్పిన మాటలను గుర్తుచేసిన ఆనంద్ మహీంద్రా.. రాకేశ్ చెప్పిన ఓ పెట్టుబడి సూచన జీవితంలో ఎన్నడూ మరచిపోనంత విలువైనదని పేర్కొన్నారు.

'ఈ పోస్టు విస్తృతంగా షేర్ అవుతోంది. ఎంతో లాభాన్నిచ్చే, అత్యంత విలువైన సూచనను చనిపోయే కొన్ని రోజుల ముందు రాకేశ్ ఝున్ ఝున్ వాలా చెప్పారు. మామూలుగా కాదు, ఎన్నో బిలియన్ల విలువైన సూచన అది. అయితే, అందులో కీలక విషయం ఏమిటంటే.. అందుకు మీ డబ్బును పెట్టుబడిగా పెట్టాల్సిన అవసరం లేదు.. కేవలం సమయాన్ని కేటాయిస్తే చాలు' అంటూ ఆనంద్ మహీంద్రా వివరించారు.

ఆ పెట్టుబడి ఏంటి......?

దిగ్గజ ఇన్వెస్టర్ గా పేరుగాంచిన ఝున్ ఝున్ వాలా (Rakesh Jhunjhunwala... స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల గురించి చెప్పిన ఎన్నో సూచనలు, సలహాలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. విజయవంతమైన ఇన్వెస్టర్‌నే అయినప్పటికీ తాను ఓ చెత్త పెట్టుబడి పెట్టానంటూ చెప్పుకొచ్చారు. నేను పెట్టిన అత్యంత పనికిరాని పెట్టుబడి నా ఆరోగ్యం. ప్రతి ఒక్కరినీ నేను ప్రోత్సహించేది ఏంటంటే . ఎక్కువ భాగం ఆరోగ్యానికి కేటాయించండి' అంటూ విలువైన సూచన చేశారు. ఇది కాస్త వైరల్ గా మారడంతో స్పందించిన ఆనంద్ మహీంద్రా.. ఆరోగ్యం పై రాకేశ్ ఇచ్చిన సలహా బిలియన్ల విలువైనదంటూ చెప్పుకొచ్చారు.

కొన్నేళ్లపాటు స్టాక్ మార్కెట్లో విజయవంతమైన ఇన్వెస్టర్ గా పేరుగాంచిన రాకేశ్ ఝున్  ఝున్ వాలా (Rakesh Jhunjhunwala) ఆగస్టు 14న గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ప్రారంభంలో రూ. 5వేలతో వ్యాపారం మొదలు పెట్టిన ఆయన.. 2022 నాటికి రూ. 40వేల కోట్ల సంపదను సమకూర్చుకున్నారు. దాంతో స్టాక్ మార్కెట్లో మదుపుచేసే వారికి, కలల్ని నిజం చేసుకోవాలనుకునే వారికి ఆదర్శంగా నిలిచారు. విజయవంతమైన మదుపరిగా ఎదగాలంటే మొదట కొన్ని తప్పులు చేసి వాటి నుంచి నేర్చుకోవాలని చెప్పే ఝున్  ఝున్ వాలా.. స్టాక్ మార్కెట్లో నిలదొక్కుకునేందుకు చెప్పిన విజయ సూత్రాలకు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృత ఆదరణ లభిస్తోంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags