Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Mid-Level Health Providers Recruitment 2022 – Details Here

 

AP Mid-Level Health Providers Recruitment 2022 – Details Here

ఏపీ-వైద్య, ఆరోగ్య శాఖలో 1681 మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ల  ఖాళీలు – అర్హత మరియు దరఖాస్తు వివరాలు ఇవే

Dr. YSR VHC: వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ లో 1,681 ఎంఎల్ హెచ్ పీ పోస్టులు

ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్- హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్లలో సేవలు అందించడానికి ఒప్పంద ప్రాతిపదికన 1,681 మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్(ఎంఎల్హెచ్ పీ) ఖాళీల భర్తీకి వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.

మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్(ఎంఎల్ హెచ్ పీ): 1,681 పోస్టులు

అర్హతలు: ఏపీ నర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో బీఎస్సీ నర్సింగ్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. లేదా సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఫర్ కమ్యూనిటీ హెల్త్ (సీపీసీహెచ్) కోర్సుతో బీఎస్సీ పూర్తి చేసి ఉండాలి.

వయోపరిమితి: నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నాటికి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 18 నుంచి 35 ఏళ్ల లోపు వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు అయిదేళ్లు, ఎక్స్ సర్వీస్ మెన్ కు 10 ఏళ్లు మినహాయింపు ఉంటుంది.

జీతభత్యాలు: నెలకు రూ.25,000

ఎంపిక, పరీక్ష విధానం: ఆన్‌లైన్ పరీక్షలో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపికలుంటాయి. బీఎస్సీ నర్సింగ్ సిలబస్ నుంచి 200 ప్రశ్నలకు బహుళైచ్ఛిక విధానంలో పరీక్ష ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 200 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. పరీక్ష సమయం మూడు గంటలు.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్య మైన తేదీలు…

ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ: ఆగస్టు 9 నుంచి 22వ తేదీ వరకు.

హాల్ టికెట్లు జారీ: 24 నుంచి 30వ తేదీ వరకు.

పరీక్ష నిర్వహణ: సెప్టెంబర్ మొదటి వారంలో.

NOTIFICATION

PAYMENT

APPLICATION

RECRUITMENT PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags